మిర్చి @18 వేలు..కిలో కొత్తిమీర రూ. 150

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 02:08 AM IST
మిర్చి @18 వేలు..కిలో కొత్తిమీర రూ. 150

ఖమ్మం జిల్లాలో తేజా రకం మిర్చి ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. మిర్చి సాగు చరిత్రలో ఇంత ధర ఎప్పుడూ పలకలేదని రైతులు అంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కట్‌లో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజా రకం మిర్చికి 2019, నవంబర్ 06 బుధవారం క్వింటాలు ధర రూ. 18 వేల 100 పలికింది. ఈ రకం మిర్చికీ విదేశాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. జూన్ నెల నుంచి దర పెరుగుతూ వస్తోందని, జూన్‌‌ నెలలో రూ. 11 వేల ధర ఉందని రైతులు వెల్లడించారు. అనూహ్యంగా రూ. 18 వేలకు పైకి ఎగబాకిందన్నారు. పంట నిల్వ చేసిన వారికి ప్రస్తుత ధరలు సిరులకు కురిపిస్తోంది. మిర్చి పండించే కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రస్తుతం మరింతగా ధర పెరిగే..అవకాశం ఉందని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

మరోవైపు భారీ వర్షాల కారణంగా కూరగాయలు కొండెక్కుతున్నాయి. భారీగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యుడి జేబు గుల్లవుతోంది. కొత్తిమీర పంటలు దెబ్బతిన్నాయి. కిలో కొత్తిమీర రూ. 150 పలికింది. వరంగల్ జిల్లాల్లో స్థానికంగా కొత్తిమీర పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, మహారాస్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ కూడా వర్షాలు పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. పంజాబ్ రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాలని వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొత్తిమీరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. విమానం ద్వారా కొత్తిమీరలను తరలించేందుకు అక్కడి వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నట్లు లక్ష్మీపురం మార్కెట్‌కు చెందిన వ్యాపారులు వెల్లడించారు. 
Read More : ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం