Motorola Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో G52 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Motorola Moto G52 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. Motorola Moto G52 కొత్త స్మార్ట్‌ఫోన్‌ OLED డిస్‌ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయింది.

Motorola Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో G52 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Motorola Moto G52 With Oled Display Launched, Price In India Starts At Rs 14,499

Motorola Moto G52 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. Motorola Moto G52 కొత్త స్మార్ట్‌ఫోన్‌ OLED డిస్‌ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో రిలీజ్ అయింది. వాస్తవానికి, రూ. 15,000లోపు సిగ్మంట్‌లో అధిక రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 5G సపోర్ట్ లేదు. Motorola Moto G52 ప్రారంభంలో యూరోప్‌లో EUR 249కి లాంచ్ అయింది. అయితే భారత మార్కెట్లో ఈ G52 బడ్జెట్ ఫోన్ ధర (Rs 14,499) చాలా తక్కువకే అందుబాటులోకి వచ్చింది. సరసమైన ధరకే లభించే స్మార్ట్ ఫోన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

Motorola Moto G52 ధర :
Motorola Moto G52 ధర 4GB RAM వేరియంట్‌కు రూ. 14,499గా నిర్ణయించింది. 6GB వేరియంట్‌కు రూ. 16,499గా నిర్ణయించింది. మే 3న ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Moto G52 ఫోన్ మొదటి సేల్ ప్రారంభం కానుంది. అడ్వాన్స్ లేదా EMI చెల్లింపుల కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తే.. మీరూ రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. Moto G52 పింగాణీ వైట్ చార్కోల్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.

Motorola Moto G52 With Oled Display Launched, Price In India Starts At Rs 14,499 (1)

Motorola Moto G52 With Oled Display Launched, Price In India Starts At Rs 14,499 

Motorola Moto G52 స్పెసిఫికేషన్స్ :
స్పెసిఫికేషన్ల వారీగా చూస్తే.. Moto G52 బడ్జెట్ ఫోన్‌గా వచ్చింది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. టాప్ కార్నర్ మధ్యలో పంచ్-హోల్ అందించారు. అందులో లోపల 16-MP సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC పవర్ అందిస్తోంది. గరిష్టంగా 6GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. Moto G52 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని అమర్చారు.

Motorola G52 కంపెనీ MyUX స్కిన్‌తో Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. Moto G52లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. Moto G52 వెనుక 50-MP ప్రధాన కెమెరా ఉంది. 8-MP అల్ట్రావైడ్ కెమెరా, 2-MP డెప్త్-సెన్సింగ్ కెమెరాతో వస్తోంది. ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్ కూడా అందించారు. ఫోన్ IP52-రేటెడ్ బాడీతో వస్తోంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.

Read Also : జియో ఆఫర్.. Cashback కూడా : Motorola వన్ యాక్షన్.. ధర ఎంతంటే?