Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Moto G62 5G త్వరలో లాంచ్ కానుంది.

Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

Motorola Tipped To Launch Moto G62 And A Flagship Phone In India

Moto G62 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో Moto G62 5G త్వరలో లాంచ్ కానుంది. మోటరోలా కంపెనీ ఈ బడ్జెట్ 5G ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు. నివేదిక ప్రకారం.. ఫ్లాగ్‌షిప్ మోటో ఫోన్ లాంచ్‌ త్వరలోనే ఉంది. అంటే.. Motorola నుంచి Snapdragon 8+ Gen 1 సామర్థ్యంతో డివైజ్ రానుంది. భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే కాదు. OnePlus 10T జూన్ చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి రానుందని రుమర్లు వినిపిస్తున్నాయి.

Xiaomi టాప్-ఎండ్ Xiaomi 12 అల్ట్రా ఫోన్‌ను జూలై 4న లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందా లేదా అనేది రివీల్ చేయలేదు. షావోమీ మొదటి అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. దాంతో షావోమీ 12 ఫోన్ కూడా ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే Apple iPhone 14 సిరీస్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. Motorola కంపెనీ విషయానికి వస్తే.. ఈ బ్రాండ్ ఇప్పటికే జూలై 4న భారత మార్కెట్లో Moto G42ని లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఇటీవల బ్రెజిల్‌లో Moto G62 ఫోన్ లాంచ్ చేసింది. ఆపై భారత మార్కెట్లోకి కూడా ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ పేరు ఇంకా రివీల్ కాలేదు.

Motorola Tipped To Launch Moto G62 And A Flagship Phone In India (1)

Motorola Tipped To Launch Moto G62 And A Flagship Phone In India 

బ్రెజిల్‌లో, Moto G62 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఇందులో LCD ప్యానెల్ మాత్రమే ఉంది. హుడ్ కింద బడ్జెట్ ఫోన్లలో అమర్చే Qualcomm Snapdragon 480+ SoC ఉంది. అంతేకాదు 5G సపోర్టు కూడా ఉంది. 20W టర్బో ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌తో కంపెనీ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. 50-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ 2-MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలను తీయడానికి 16-MP కెమెరా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Read Also : Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?