Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రముఖ మోటరోలా కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోటో ఫోన్ వస్తోంది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్..

Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Moto G42 India Launch Date Confirmed, Key Specs And Design Revealed

Moto G42 India : ప్రముఖ మోటరోలా కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోటో ఫోన్ వస్తోంది. అదే.. Moto G42 స్మార్ట్ ఫోన్.. ఈ కొత్త ఫోన్ జూలై 4న భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది మోటరోలా. ఇప్పటికే Moto G40 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ Moto G52, Motorola Edge 30 స్మార్ట్ ఫోన్లను కూడా భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

అయితే అధికారిక రిలీజ్‌కు ముందే Motorola Moto G42 ఫ్లిప్‌కార్ట్ పేజీలో లిస్టు చేసింది. ఈ ఫోన్ డిజైన్, కలర్స్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఇతర కీలక స్పెసిఫికేషన్‌ రివీల్ చేసింది. కొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. Full- HD+ రిజల్యూషన్‌తో 6.4-అంగుళాల డిస్‌ప్లే సింగిల్ 16-MP సెల్ఫీ కెమెరాతో హోల్-పంచ్ కటౌట్ ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్‌ బ్లూ, పింక్ కలర్లలో ఫ్లాట్ ఎడ్జ్‌లతో రివీల్ కానున్నాయి. మోటరోలా ఈ కలర్ ఆప్షన్లను అట్లాంటిక్ గ్రీన్ మెటాలిక్ రోజ్ మోడల్‌తో తీసుకొస్తోంది. దీని వెనుక ప్యానెల్ PMMAతో తీసుకొచ్చింది.

Moto G42 India Launch Date Confirmed, Key Specs And Design Revealed (2)

Moto G42 India Launch Date Confirmed, Key Specs And Design Revealed

టెక్నికల్‌గా ప్లాస్టిక్‌ డిజైన్‌‌తో రానుంది. Moto G42 ఆడియో Dolby Atmosతో డ్యూయల్ స్పీకర్లతో వస్తుంది. హుడ్ కింద.. Qualcomm స్నాప్‌డ్రాగన్ 680తో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు చిప్‌సెట్ 64GB స్టోరేజీతో వస్తుంది. RAM కాన్ఫిగరేషన్ పై క్లారిటీ లేదు. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ IP52-సర్టిఫైడ్ బిల్డ్‌ పొందవచ్చు. కెమెరాల విషయానికి వస్తే.. వెనుక కెమెరా మాడ్యూల్ 50-MP వెనుక కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు మాక్రో సెన్సార్ కూడా ఉండనుంది.

చివరగా, Moto G42 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G42 లాంచ్ తేదీ రోజున సేల్ ప్రారంభం అవుతుందా లేదా అనేది రివీల్ చేయలేదు. మోటో G42 ఫోన్ ధర ధర రూ. 20,000 లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతం, Moto G52 ధర రూ.16,499, రూ.14,499 ధరలకు అందుబాటులో ఉండగా, Motorola Edge 30 భారత మార్కెట్లో రూ.27,999 రూ.29,999కి అందుబాటులో ఉంది.

Read Also : Motorola Moto G52 : OLED డిస్‌ప్లేతో మోటో G52 సిరీస్ బడ్జెట్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?