జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. లాభాలివే..

స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 05:55 PM IST
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. లాభాలివే..

స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్

స్టార్టింగ్ లో అంతా ఫ్రీ ఫ్రీ అని ఊదరగొట్టిన రిలయన్స్ జియో(reliance jio) క్రమంగా ఛార్జీల బాదుడు షురూ చేసింది. లాంచింగ్ సమయంలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ డేటాతో కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేసిన జియో.. టార్గెట్ రీచ్ అయ్యాక తన అసలు రూపం చూపిందనే విమర్శలున్నాయి. ఇటీవలి కాలంలో టారిఫ్ లు భారీగా పెంచేసింది. వాయిస్ కాల్స్, డేటా విషయంలో కోతలు పెట్టింది. బిల్లులు భారీగా పెరగడంతో.. కస్టమర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వారిని కూల్ చేసేందుకు జియో పలు రకాల ప్లాన్లు తీసుకొస్తోంది. 

తాజాగా తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు(prepaid plans) తీసుకొచ్చింది జియో. అవి కూడా రూ.70లోపే. రూ.49, రూ.69 ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారికి ఇవి సరిగ్గా సరిపోయే ప్లాన్లు. ఈ ప్లాన్ల లాభాల విషయానికి వస్తే.. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తన దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరించడంతో పాటు, రిలయన్స్ జియో రెండు తక్కువ వ్యాలిడిటీ ప్లాన్లు (రూ.49, రూ.69) రిలీజ్ చేసింది. ఈ రెండు ప్లాన్ల ద్వారా ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి ఉచిత నిమిషాలు, డేటా లాభాలు, 14 రోజుల వ్యాలిడిటీ ఉంటాయి. 

రూ.49 ప్లాన్ లాభాలు:
రిలయన్స్ జియో గతంలో జియోఫోన్ వినియోగదారులకు రూ.49 ప్లాన్‌ను అందించేది. 2019 డిసెంబర్‌లో టారిఫ్ ల సవరణ తర్వాత దీన్ని తొలగించింది. ఇదే ప్లాన్ ను ఇప్పుడు సగం వ్యాలిడిటీతో తీసుకొచ్చింది.
* జియో నుంచి జియోకు అపరిమిత వాయిస్ కాలింగ్
* ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 250 నాన్-జియో నిమిషాలు
* 2 GB 4G డేటా
* 25 SMS
* ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు
* కొత్త రూ.49 ప్లాన్, మునుపటి రూ.49 ప్లాన్ లాభాలు దాదాపు సమానం, వ్యాలిడిటీ మాత్రం సగానికి తగ్గిపోయింది.

రూ.69 ప్లాన్ లాభాలు:
* జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్
* ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 250 నాన్-జియో నిమిషాలు
* 0.5 GB 4G డేటా
* 25 SMS
* ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు

గతంలో జియో తీసుకొచ్చిన ప్లాన్లతో పోలిస్తే.. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ తక్కువ. దీంతో ఈ ప్లాన్లు మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా రోజుల తర్వాత రిలయన్స్ జియో తన లాంగ్ టర్మ్ ప్లాన్లకు ఈ మధ్యనే మార్పులు చేసింది. న్యూ ఇయర్ 2020 ప్లాన్ ను పూర్తిగా తీసేసి దాని స్థానంలో రూ.2121 ప్లాన్ ను తీసుకొచ్చింది. జియోలో ఇప్పటికే రూ.75, రూ.99, రూ.153, రూ.297, రూ.594 వంటి దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఐయూసీ(Interconnect Usage Charge) చార్జీలు వసూలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాతి నుంచి జియో తన ప్లాన్లలో మార్పులు చేస్తూ వస్తోంది. ఐయూసీ చార్జీల వసూలు ఎఫెక్ట్ జియోపై పడింది. 2019 డిసెంబర్ లో జియో కస్టమర్ల సంఖ్య తగ్గింది. డిసెంబర్ నెలలో కేవలం 82వేల 308 కస్టమర్లు వచ్చి చేరారు. 2019 నవంబర్ తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ. నవంబర్ నెలలో 56లక్షల 08వేల 668 కొత్త కస్టమర్లు జియోలో చేరారు. ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఏజీఆర్(Adjusted Gross Revenue) బకాయిల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. జియో మాత్రం ఏజీఆర్ బకాయిల కింద ఇప్పటికే ప్రభుత్వానికి రూ.195 కోట్లు చెల్లించింది.