కరోనా ఎఫెక్ట్: కుప్పకూలిన మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్.. భారీగా నష్టాలు

  • Published By: vamsi ,Published On : March 13, 2020 / 04:48 AM IST
కరోనా ఎఫెక్ట్: కుప్పకూలిన మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్.. భారీగా నష్టాలు

మార్కెట్లను కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలతోనే కాదు.. మదుపర్ల జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రతి రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తుండగా.. లేటెస్ట్‌గా స్టాక్ మార్కెట్లలో మహాపతనం​ కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే అంచనాతో అమెరికా మార్కెట్లు నష్టాల బాటపట్టగా.. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3090 పాయింట్లు నష్టపోయి 29,687 పాయింట్లకు పతనమైంది.(బెంగళూరులో మరో కరోనా కేసు.. గూగుల్ ఉద్యోగికి పాజిటివ్ )

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 966 పాయింట్ల నష్టంతో 8624 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా బుధవారం ఒక్కరోజే రూ.800లక్షల కోట్ల సంపద కరోనా వైరస్.. కారణంగా ఆవిరి అయిపోయింది. ఈ నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 

అ క్రమంలో సెన్సెక్స్‌, నిఫ్టీలు లోయర్‌సర్క్యూట్‌ను తాకడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ ఆగిపోయింది. 1987, బ్లాక్‌ మండే తర్వాత భారీ నష్టాల్ని చవిచూసిన అమెరికా మార్కెట్లు.. ఆసియా సూచీలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. ఐరాస కరోనాని ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంతో ఆర్థిక మాంద్యం తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.