OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్‌లో రూ. 17,500 లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు..!

OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) అందరికీ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రత్యేక విక్రయ సమయంలో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.

OnePlus Nord CE 3 Lite 5G : అమెజాన్‌లో రూ. 17,500 లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు..!

OnePlus Nord CE 3 Lite available for under Rs 17,500 during Amazon Great Indian festival, details here

OnePlus Nord CE 3 Lite 5G : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) అతిపెద్ద విక్రయాలలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) అక్టోబర్ 8న లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు (Amazon Prime Members) ఒక రోజు ముందుగానే సేల్‌కు యాక్సెస్ పొందవచ్చు.

అక్టోబర్ 7న వినియోగదారులు బెనిఫిట్స్ పొందవచ్చు. సేల్, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కిచెన్ అప్లియన్సెస్ మొదలైన వాటిపై వివిధ డీల్‌లు పొందవచ్చు. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పొందాలంటే ఇదే సరైన అవకాశం. అమెజాన్ ఇప్పటికే ఆవిష్కరించిన డీల్‌లలో (OnePlus Nord CE 3 Lite)పై అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. వాస్తవానికి రూ.19,999 ఖరీదు చేసే ఈ ఫోన్ రూ.18వేల లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

Read Also : OnePlus Foldable Phone : భారత్‌కు ఈ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ రానేలేదు.. అనుష్క శర్మ చేతిలో కొత్త వన్‌ప్లస్ మడతబెట్టే ఫోన్ చూశారా?

వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ తగ్గింపు :
సేల్‌కు ముందు అమెజాన్ ల్యాండింగ్ పేజీ ద్వారా డీల్‌ను వివరించింది. అమెజాన్ ప్రకారం.. వన్‌ప్లస్ (OnePlus Nord CE 3 Lite) ధర రూ. 1,000 కూపన్ తగ్గింపును అందిస్తుంది. ఈ 5G ఫోన్‌పై వర్తించే బ్యాంక్ డిస్కౌంట్ ధరను అదనంగా రూ. 1500 తగ్గించవచ్చు. అందువల్ల, ఫోన్ నికర ధర రూ. 17,499కి తగ్గించింది. అయితే, బ్యాంక్ డిస్కౌంట్ SBI కార్డ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. ‘Notify Me‘ బటన్‌ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.

OnePlus Nord CE 3 Lite available for under Rs 17,500 during Amazon Great Indian festival, details here

OnePlus Nord CE 3 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ టాప్ స్పెషిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌కు బదులుగా (Asahi Dragontrail) స్టార్ గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేసిన 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా OxygenOS 13.1తో రన్ అవుతుంది.

ఈ ఫోన్ బ్లోట్‌వేర్‌తో వస్తుంది. కానీ, అవసరమైతే ఈ యాప్‌లను డిలీట్ చేయొచ్చు. కెమెరా విషయానికి వస్తే.. 108MP ప్రైమరీ Samsung HM6 సెన్సార్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ Nord CE 3 Lite సెల్ఫీలు, వీడియో కాల్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

నార్డ్ CE 3 లైట్ ఫోన్ 67W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ 80W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. OnePlus ఫోన్ 2 వేరియంట్‌లలో వస్తుంది. 8GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ + 8GB LPDDR4x RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది.

Read Also : Redmi Note 12 5G Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11వేల లోపు ధరకే రెడ్‌మి 5G ఫోన్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!