OnePlus Pad Pre Order : మే 1న వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఇప్పుడే ప్రీ-ఆర్డర్ పెట్టుకోండి.. రూ.2వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్..!
OnePlus Pad Pre Order : వన్‌ప్లస్ నుంచి కొత్త ప్యాడ్ డివైజ్ వస్తోంది. మే 1న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. లాంచ్‌కు ముందే వన్‌ప్లస్ ప్యాడ్ ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది.

OnePlus Pad now available for pre-order
OnePlus Pad Pre Order : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త వన్‌ప్లస్ ప్యాడ్ (OnePlus Pad) వచ్చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో OnePlus ఫస్ట్ టాబ్లెట్, OnePlus 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్, బడ్స్ ప్రో 2 సిరీస్, TWS ఇయర్‌బడ్‌లను ఆవిష్కరించింది. కొన్ని నెలల తర్వాత వన్‌ప్లస్ ప్యాడ్ మే 1వ తేదీన గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పుడు వన్‌ప్లస్ ప్యాడ్ డివైజ్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు వన్‌ప్లస్ ప్యాడ్ ఆర్డర్ల కోసం OnePlus అధికారిక వెబ్సైట్, (Amazon India) వెబ్సైట్ లేదా OnePlus ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ స్టోర్లను విజిట్ చేయొచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్ మే 1న మార్కెట్లోకి రానుంది.
ఆసక్తి గల వినియోగదారులు Amazon.in, Flipkartతో సహా వివిధ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. Moroever, OnePlus ప్యాడ్ 2 కాన్ఫిగరేషన్లలో (8GB+128GB, 12GB+256GB) అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ మొదటి వేరియంట్ ధర రూ. 37,999 ఉండనుంది. రెండో ప్యాడ్ వేరియంట్ రూ. 39,999 ధరతో రానుంది.
ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను Amazon.in, Flipkart.com, OnePlus.in, OnePlus స్టోర్ యాప్ వంటి అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ల నుంచి టాబ్లెట్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, అలాగే రిలయన్స్, క్రోమా స్టోర్లలో కూడా కొనుగోలు చేయొచ్చు.

OnePlus Pad now available for pre-order
రూ.2వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ :
OnePlus, ICICI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా OnePlus.in, OnePlus స్టోర్ యాప్, Amazon, Flipkart, OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్లు, ఎంపిక చేసిన పార్టనర్ స్టోర్లలో EMI లావాదేవీలను ఎంచుకోవచ్చు. కొనుగోలుదారులు రూ. 2వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కొనుగోలుదారులు 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
ప్రీ-ఆర్డర్ కస్టమర్లు రూ. 1,499 విలువ చేసే ఉచిత ఫోలియో కేస్‌ను అందుకోవచ్చు. అదనంగా, (OnePlus Xchange) ప్రోగ్రామ్ ద్వారా కొనుగోలుదారులు OnePlus స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ. 5వేలు లేదా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు టాబ్లెట్ల ఎక్స్ఛేంజ్పై రూ. 3వేలు సేవ్ చేయవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ ఫీచర్లు ఇవే :
OnePlus ప్యాడ్ FHD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 11.6-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 9000 చిప్సెట్తో వచ్చింది. 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. టాబ్లెట్ ఒకే WiFi వేరియంట్‌ను కలిగి ఉంది. EISకి సపోర్టు ఇచ్చే 13MP వెనుక కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద వీడియోలను రికార్డ్ చేయొచ్చు.
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. 6.5mm మందం, 552gm బరువుతో, OnePlus ప్యాడ్ 9,510 mAh బ్యాటరీని కలిగి ఉంది. 65W SuperVOOC ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. టాబ్లెట్‌లో 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ అందించడం లేదు. అందుకే వినియోగదారులు బ్లూటూత్ ఇయర్‌బడ్‌లతో కనెక్ట్ చేసుకోవచ్చు.