Indian Smartphone Market : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ క్షీణత.. అగ్రగామిగా ఆపిల్, శాంసంగ్.. కష్టాల్లో చైనా కంపెనీలు..!

Indian Smartphone Market : 2023 మొదటి త్రైమాసికంలో (Q1 2023) భారత స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 19శాతం క్షీణతతో 31 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధికంగా (Q1) భారీగా క్షీణించింది.

Indian Smartphone Market : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ క్షీణత.. అగ్రగామిగా ఆపిల్, శాంసంగ్.. కష్టాల్లో చైనా కంపెనీలు..!

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian Smartphone Market : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2023 మొదటి త్రైమాసికంలో అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చాలావరకూ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ మార్కెట్‌ను విస్తరించాయి. మరికొన్ని స్మార్ట్ బ్రాండ్లు మాత్రం భారీ క్షీణతను చవిచూశాయి. ప్రత్యేకించి భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో పతనం కొనసాగుతోంది. వరుసగా ఇది మూడో త్రైమాసిక క్షీణత అయినప్పటికీ.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) మాత్రం అగ్రగామిగా కొనసాగుతున్నాయి.

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో షావోమీ (Xiaomi), రియల్‌మి (Realme) బ్రాండ్లు మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగాయి. దీనికి మూడో త్రైమాసిక క్షీణత కారణమని మార్కెట్ పరిశోధన సంస్థ తెలిపింది. అందులోనూ మార్కెట్ డిమాండ్ మందగించడం, 2022 నుంచి అధిక ఇన్వెంటరీ బిల్డ్-అప్, సరసమైన ధరలకే రీఎంట్రీ ఇచ్చిన ఫోన్‌లపై పట్ల వినియోగదారుల ప్రాధాన్యత పెరగడం వంటి అనేక కారణాలతో క్షీణత ఏర్పడిందని మార్కెట్ పరిశోధన సంస్థ తెలిపింది.

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

5G ఫోన్‌లలో అగ్రగామిగా శాంసంగ్ :
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. Q1 2023లో కూడా శాంసంగ్ మార్కెట్ వాటా 20శాతం వద్ద ఉంది. శాంసంగ్ కూడా 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తద్వారా మార్కెట్లో 24శాతం వాటాను కలిగి ఉంది. శాంసంగ్ 5G-సామర్థ్యంతో A సిరీస్ ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ అదే జోరు కొనసాగించింది. 50శాతం షిప్‌మెంట్‌లను అందించింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో ఏడాదికి 247శాతం పెరిగింది.

Read Also : Best Premium Smartphones : ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ప్రీమియం విభాగంలో అగ్రగామిగా ఆపిల్ :
ఆపిల్ 50శాతం (YYY) వృద్ధి చెందింది. Q1 2023లో 6శాతం వాటాను పొందింది. అయినప్పటికీ మొత్తం ప్రీమియం విభాగంలో అల్ట్రా-ప్రీమియం విభాగంలో వరుసగా 36శాతం, 62శాతం షేర్లతో ఆధిక్యంలో నిలిచింది. దేశంలో సొంత రిటైల్ స్టోర్లను ఇటీవల ప్రారంభించిన ఆపిల్ బ్రాండ్ తన ఇమేజ్‌ను మరింత బలోపేతం చేస్తోంది. అదే ఆపిల్ కంపెనీ పర్యావరణ వ్యవస్థకు మెరుగైన వృద్ధికి దారి తీస్తుందని నివేదిక పేర్కొంది.

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

షావోమీ, రియల్‌మికి తీరని కష్టాలు :
ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల కన్నా భారత మార్కెట్లో చైనా దిగ్గజాల్లో ఒకటైన షావోమీ (Xiaomi)కు కష్టాలు తప్పడం లేదు. షావోమీ Q1 2022 నుంచి Q1 2023 వరకు గణనీయమైన తగ్గుదలని చవిచూసింది. తద్వారా (Q1 2023)లో మూడవ స్థానానికి పడిపోయింది. చైనీస్ కంపెనీ 44శాతం (YYY) క్షీణతను చవిచూసింది. దాంతో షావోమీ బ్రాండ్ గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం 16శాతం వాటాతో భారీ క్షీణతను ఎదుర్కొంది. మరో చైనా బ్రాండ్ రియల్‌మి (Realme) కూడా భారీ క్షీణతను చవిచూసింది. Q1 2023లో 52శాతం (YYY) క్షీణతను ఎదుర్కొంది. తద్వారా ఈ బ్రాండ్‌ 9శాతం షేర్‌తో 5వ స్థానానికి దిగజారింది.

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer

రూ.10వేలలోపు విభాగంలో ఇన్వెంటరీ బిల్డ్-అప్, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు వంటి సవాళ్లను కంపెనీ ఎదుర్కొంటూనే ఉంది. (Realme C55) సిరీస్ త్రైమాసికంలో చేసిన షిప్‌మెంట్‌లలో 11శాతం వాటాతో మందుకు సాగింది. రూ. 10వేల లోపు విభాగంలో బలహీనమైన డిమాండ్, ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ఛానెల్‌లపై ఎక్కువ ఆధారపడటంతో గందరగోళంతో పాటు పోర్ట్‌ఫోలియో కారణంగా భారీ క్షీణత సంభవించింది. Redmi Note 12 సిరీస్ షావోమీ మొత్తం షిప్‌మెంట్‌లలో 14శాతం పైగా నమోదైంది.

చైనా దిగ్గజాల్లో వివో (ViVo) సరసమైన ప్రీమియం సెగ్మెంట్లో తన సత్తా చాటుతూనే ఉంది. వివో కూడా 3శాతం (YYY) క్షీణతను చూసినప్పటికీ.. Q1 2023లో 17శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానాన్ని కొనసాగించింది. కంపెనీ బలమైన ఓమ్నిచానెల్, తక్కువ ఖర్చుతో కూడిన ధర కావడంతో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. (V) సిరీస్ ద్వారా 40శాతం వాటాతో సరసమైన ప్రీమియం విభాగంలో వివో ప్రముఖ బ్రాండ్‌గా అవతరించింది.

పెరిగిన ఒప్పో షిప్‌మెంట్లు :
ఒప్పో (Oppo) 12శాతం వాటాతో 9శాతం (YOY) వృద్ధిని నమోదు చేసి నాల్గవ స్థానాన్ని పరిమితమైంది. ఈ బ్రాండ్ ముఖ్యంగా ఎగువ మిడ్-టైర్ రేంజ్ (రూ. 20వేల నుంచి రూ. 30వేల)పైనే ఎక్కువగా దృష్టి సారించింది. అన్ని బ్రాండ్‌లలోనూ ఇదే అత్యధిక వృద్ధిని సాధించింది. ఒప్పో (F) సిరీస్ ద్వారా 144శాతం (YoY) వృద్ధిని నమోదు చేసింది.

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

దూసుకుపోతున్న వన్‌ప్లస్ :
భారత మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో (OnePlus) ఒకటి. ఈ బ్రాండ్ Q1 2023లో 72శాతం YOY వృద్ధిని నమోదు చేసింది. బ్రాండ్ ప్రీమియం విభాగంలో (రూ. 30వేల నుంచి రూ. 45వేలు) 30శాతం వాటాతో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. కంపెనీ వృద్ధికి (OnePlus Nord CE 2 Lite), OnePlus 11 సిరీస్‌లకు అధిక డిమాండ్ ఏర్పడింది. అదనంగా, OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ మోడల్ కూడా Q1 2023లో అత్యధికంగా అమ్ముడైంది.

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

Indian smartphone market_ Apple, Samsung rise, Xiaomi and Realme ‘suffer’ and 6 other things to know

ఇకపోతే ట్రాన్స్‌షన్ గ్రూప్ బ్రాండ్‌లైన Itel, Infinix, Tecno భారత హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో 16శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్థానిక బ్రాండ్‌లలో, లావా (Lava) చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ (Blaze 5G)ని అందించింది. రూ. 10వేల సెగ్మెంట్‌లో రిఫ్రెష్ చేసిన పోర్ట్‌ఫోలియోతో కొనసాగింది. Q1 2023లో 29శాతం YYY వృద్ధితో మూడో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలిచింది.

Read Also : Best Smartphones in India : రూ.10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సరసమైన ధరలో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?