Raghuram Rajan: ”ఆర్బీఐ ప‌ని తీరు బాగుంది.. శ్రీ‌లంకలాంటి ప‌రిస్థితి మ‌న‌కు రాదు”

విదేశీ మార‌క నిల్వ‌లను పెంచుకోవ‌డానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప‌ని చేసిన తీరు అద్భుతంగా ఉంద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ అన్నారు. భార‌త్‌లో తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. శ్రీ‌లంక‌లో త‌లెత్తిన ఆర్థిక సంక్షోభం వంటి స‌మ‌స్య‌ల‌ను భార‌త్ ఎదుర్కొనే అవ‌కాశం లేద‌ని చెప్పారు. అలాగే, పాకిస్థాన్ ఎదుర్కొంటోన్న ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా భార‌త్‌లో ఉండ‌బోవ‌ని అన్నారు. మ‌న దేశ విదేశీ అప్పులు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని తెలిపారు.

Raghuram Rajan: ”ఆర్బీఐ ప‌ని తీరు బాగుంది.. శ్రీ‌లంకలాంటి ప‌రిస్థితి మ‌న‌కు రాదు”

Rajan

Raghuram Rajan: విదేశీ మార‌క నిల్వ‌లను పెంచుకోవ‌డానికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప‌ని చేసిన తీరు అద్భుతంగా ఉంద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ అన్నారు. భార‌త్‌లో తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. శ్రీ‌లంక‌లో త‌లెత్తిన ఆర్థిక సంక్షోభం వంటి స‌మ‌స్య‌ల‌ను భార‌త్ ఎదుర్కొనే అవ‌కాశం లేద‌ని చెప్పారు. అలాగే, పాకిస్థాన్ ఎదుర్కొంటోన్న ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా భార‌త్‌లో ఉండ‌బోవ‌ని అన్నారు. మ‌న దేశ విదేశీ అప్పులు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని తెలిపారు.

ఆర్బీఐ డేటా ప్ర‌కారం జూలై 22 నాటికి భార‌త్‌లో రూ.45.265 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌క నిల్వ‌లు ఉన్నాయి. అయితే, కొంత కాలంగా వాటి పతనం కొనసాగుతోంది. జూలై 22తో ముగిసిన వారాంతంలో 91 వేల కోట్ల రూపాయ‌లు తరిగిపోయాయి. ఈ గణాంకాలను ఆర్బీఐ నిన్న‌ విడుదల చేసింది. ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురామ్ రాజ‌న్ స్పందించారు. శ్రీలంక‌లో విదేశీ మార‌క నిల్వ‌లు అడుగంటిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అదే దిశ‌గా ప్రస్తుతం పాకిస్థాన్ సహా పలు దేశాలు ప‌య‌నిస్తున్నాయి.

Kerala: యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం త‌యారు చేసిన బాలుడు.. తాగి ఆసుప‌త్రిలో చేరిన అత‌డి స్నేహితుడు