Redmi 12 Series Sale : రెడ్‌మి 12 సిరీస్ సేల్స్ అదరహో.. లాంచ్ అయిన మొదటి రోజే 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు..!
Redmi 12 Series : రెడ్‌మి సిరీస్ అంచనాలను మించేసింది. లాంచ్ అయిన మొదటి రోజే 3 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను దాటేసింది.

Redmi 12 series exceeds expectations, sells over 300,000 units on launch day
Redmi 12 Series Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి Redmi 12 సిరీస్ లాంచ్ అయింది. ఫస్ట్ డేన 3లక్షల యూనిట్లకు పైగా విశేషమైన అమ్మకాలను సాధించింది. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ డిజైన్, సరసమైన ధరలలో అసాధారణమైన పనితీరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.
ఆకర్షణీయమైన ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వినియోగాదారులు Mi.com, Flipkart.com, Amazon.com, Mi Home, Mi Studio లేదా అధీకృత రిటైల్ భాగస్వాములలో అద్భుతమైన ధరలకు సరికొత్త Redmi స్మార్ట్‌ఫోన్‌లను పొందేందుకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
షావోమీ (Xiaomi) ఇండియా లేటెస్ట్ Redmi 12 సిరీస్ లాంచ్ అయిన మొదటి రోజునే 3లక్షల యూనిట్లకు పైగా విక్రయించడం ద్వారా విశేషమైన మైలురాయిని సాధించింది. ఈ సిరీస్‌లో రెండు డివైజ్‌లు ఉన్నాయి. అందులో Redmi 12 5G, Redmi 12 రెండూ మిడ్-రేంజ్ కొనుగోలుదారుల నుంచి విశేష ఆదరణ పొందాయి. Redmi 12 సిరీస్ ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను సరసమైన ధరలలో అసాధారణమైన పనితీరును అందిస్తుంది. Redmi 12 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 5G ప్రాసెసర్‌తో వచ్చిన భారత ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ప్రాసెసర్ ఫ్లాగ్‌షిప్-లెవల్ 4nm ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. 5G సామర్థ్యాలతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.
రెడ్‌మి 12 సిరీస్ ధర ఎంతంటే? :
Redmi 12 4G, Redmi 12 5G ఇప్పుడు అద్భుతమైన ఆఫర్‌లతో ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. Redmi 12 4G 4GB+128GB వేరియంట్ ధర రూ.8,999, 6GB+128GB వేరియంట్ ధర రూ.10,499కు పొందవచ్చు. మీరు Mi.com, Flipkart.com, Mi Home, Mi Studio అధీకృత రిటైల్ భాగస్వాములలో ఈ డీల్‌లను పొందవచ్చు.

Redmi 12 series exceeds expectations, sells over 300,000 units on launch day
5G ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లు Redmi 12 5G ఫోన్ 4GB+128GB వేరియంట్‌కు రూ. 10,999, 6GB+128GB వేరియంట్‌కు రూ. 12,499, 8GB+256GB వేరియంట్‌కు రూ.14,499 ధరతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్లలో Mi.com, Amazon.com, Mi Home, Mi Studio అధీకృత రిటైల్ భాగస్వాములలో అందుబాటులో ఉన్నాయి.
వినియోగదారులు అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు ICICI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కలిగి ఉంటే.. Redmi 12 4G లేదా Redmi 12 5G ఫోన్ 4GB వేరియంట్ కొనుగోలుపై రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఇప్పటికే ఉన్న Xiaomi యూజర్లు Redmi 12 4G ఫోన్ 4GB వేరియంట్‌పై రూ. 1000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
మీరు Redmi 12 4G 6GB వేరియంట్ లేదా Redmi 12 5G 8GB వేరియంట్‌ని ఎంచుకుంటే.. రూ. 1000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. సరికొత్త, అత్యాధునిక Redmi స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకునేందుకు ఈ అద్భుతమైన డీల్‌లను పొందవచ్చు. Mi.com, Flipkart.com, Amazon.com, Mi Home, Mi Studio లేదా అధీకృత రిటైల్ పార్టనర్ల ద్వారా ఈ అద్భుతమైన డివైజ్‌లను సొంతం చేసుకోండి.