Redmi Note 12 Pro Series : షావోమీ రెడ్‌మి నుంచి Note 12 Pro సిరీస్ ఫోన్.. ఫీచర్లు లీక్..!

Redmi Note 12 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త Note 12 సిరీస్ రాబోతోంది.

Redmi Note 12 Pro Series : షావోమీ రెడ్‌మి నుంచి Note 12 Pro సిరీస్ ఫోన్.. ఫీచర్లు లీక్..!

Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Specifications Leaked On Tenaa

Redmi Note 12 Pro Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త Note 12 సిరీస్ రాబోతోంది. Redmi Note Pro సిరీస్ లాంచ్ కాకముందే దాని ఫీచర్లు లీకయ్యాయి. ఇప్పటికే షావోమీ Xiaomi Redmi Note 11 Pro సిరీస్‌ను మార్చి 2022లో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. Redmi Note 11 Pro 4G, Redmi Note 11 Pro Plus 5G రెండు మోడళ్లను రిలీజ్ చేసింది. Redmi Note 11 Pro సిరీస్‌లో రెండు మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. అయితే షావోమీ రెడ్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో రాబోతుంది.

అదే.. Remi Note 12 Pro, Redmi Note 12Pro+ సిరీస్.. అయితే ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉండగా అంతకంటే ముందుగానే ఫీచర్లు లీకయ్యాయి. ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. TENAAలోని లిస్ట్ మోడల్ నుంచి రెండు డివైజ్‌ల కొన్ని స్పెసిఫికేషన్ల వివరాలను లీక్ చేసింది. ఆ ఫోన్ల మోడల్ నంబర్ 22041216Cగా గుర్తించింది. Redmi Note సిరీస్ రెండు డివైజ్‌ల్లో ఒకటి Redmi Note 12 Pro, రెండోది Redmi Note 12 Pro+ రానుంది. దీని మోడల్ నంబర్ 22041216UCగా ఉంది.

Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Specifications Leaked On Tenaa (1)

Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Specifications Leaked On Tenaa 

రెడ్‌మి నోట్ 12 Pro సిరీస్ డివైజ్ రెండూ 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయని TENAA జాబితాలో వెల్లడించింది. రెండు ఫోన్ మోడళ్లు Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతోపాటు AMOLED డిస్‌ప్లేతో రావొచ్చు. రెడ్‌మి నోట్ 12Pro ఫోన్ 4980 mAh బ్యాటరీతో రానుంది. 5000 mAh బ్యాటరీతో రానుంది. రెడ్‌మి ఫోన్ 12Pro+ మోడల్ చిన్న 4300 mAh బ్యాటరీతో రానుంది. ఈ రెండు డివైజ్‌లు మందంగా 8.8mmతో రానున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి.

ఆండ్రాయిడ్ పైన MIUI 13 లేయర్ ఉంటుందని అంచనా. ఈ రెండు Redmi Note సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి పూర్తి వివరాలను TENAA వెల్లడించలేదు. Xiaomi Redmi Note 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం MediaTek హై-ఎండ్ చిప్‌సెట్‌లను ఎంచుకోవచ్చని ఆన్‌లైన్ నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ MediaTek డైమెన్సిటీ 8100 SoC లేదా డైమెన్సిటీ 8000 SoCని ఎంచుకోవచ్చు. Redmi Note 12 సిరీస్ ఈ ఏడాది చివర్లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏడాదిలో రెడ్‌మి సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నోట్ లైనప్‌ను రిఫ్రెష్ చేస్తుంది. ఈ ఏడాది కూడా Redmi Note 12 Series సెప్టెంబర్‌లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఎప్పుడు రానుంది క్లారిటీ లేదు.

Read Also : Best Mobile Phones : రూ. 10వేల లోపు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!