Reliance AGM 2023 Event : ఆగస్ట్ 28న రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ జియో 5G ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తారా?

Reliance AGM 2023 Event : ఆగస్ట్ 28న రిలయన్స్ AGM 2023 ఈవెంట్.. ముఖేష్ అంబానీ జియో 5G ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తారా?

Reliance AGM 2023 event on August 28_ Will Mukesh Ambani announce Jio 5G prepaid plans

Reliance AGM 2023 Event : ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 46వ RIL AGM 2023 ఈవెంట్ తేదీలను ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారత మార్కెట్లో రిలయన్స్ జియో 5G భవిష్యత్తు, టారిఫ్ ప్లాన్‌లపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదిలో అతిపెద్ద ఈవెంట్‌లలో జియో ఆగస్టు 28న కంపెనీ నిర్వహించనుంది. దాంతో పాటు, JioAir Fiber రోడ్‌మ్యాప్, కొత్త 5G Jio స్మార్ట్‌ఫోన్ మరిన్నింటి వివరాలను కూడా వెల్లడించనుంది. అయితే, జియో 5Gకి సంబంధించిన అప్‌డేట్‌లు చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.

ఆగస్ట్ 28న రిలయన్స్ AGM 2023 ఈవెంట్ :
RIL AGM 2023 ఈవెంట్ సందర్భంగా, ముఖేష్ అంబానీ కొత్త (Jio 5G) ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తారని పుకార్లు వచ్చాయి. రిలయన్స్ జియో ఇప్పటికే చాలా వరకు భారతీయ ప్రాంతాలలో 5G నెట్‌వర్క్‌లను అమలు చేసింది. 2024 నాటికి పూర్తి స్థాయి Jio 5G సర్వీస్ ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 7,500 కన్నా ఎక్కువ ప్రాంతాలు, జిల్లాలు, నగరాల్లో 5G కవరేజీని కంపెనీ విస్తరిస్తోంది.

Read Also : Moto G54 5G Launch Date : మోటో G54 5G ఫోన్ వస్తోంది.. సెప్టెంబర్ 5నే లాంచ్.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!

జియో 5G సర్వీసులను అందించడానికి ఇప్పటికే ఉన్న 4G ప్లాన్‌లను సైతం ఉపయోగించుకుంది. అయినప్పటికీ, కంపెనీ ఈ ఈవెంట్‌ని 5G టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించడానికి వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్‌లను రాబోయే AGM ఈవెంట్‌లో అంబానీ ప్రకటిస్తారా? లేదా రాబోయే నెలల్లో ప్రవేశపెట్టబడతారా? అనేది క్లారిటీ లేదు. ఈ ప్లాన్‌లకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని గమనించాలి. ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాలి.

Reliance AGM 2023 event on August 28_ Will Mukesh Ambani announce Jio 5G prepaid plans

Reliance AGM 2023 event on August 28_ Will Mukesh Ambani announce Jio 5G prepaid plans

భారత్‌లో 5G టారిఫ్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధర ఎంత? :
5G టారిఫ్ ప్లాన్‌లను సరసమైన ధరకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. 1GBకి దాదాపు రూ. 300 నుంచి దాదాపు రూ. 10కి డేటా ఖర్చులు గణనీయంగా తగ్గించాయి. సగటున, భారత్‌లో ఒక వ్యక్తి నెలకు 14GB వినియోగిస్తున్నాడు. దీని కోసం నెలకు సుమారు రూ. 4200 ఖర్చు అవుతుంది. అయితే రూ. 125 నుంచి 150 ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని ఏ టెలికాం కంపెనీతో పోల్చినా జియో 5G టారిఫ్ ప్లాన్‌లు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని అంబానీ గత ఏడాదిలోనే ప్రకటించారు.

అదనంగా, ఎయిర్‌టెల్‌లోని ఒక సీనియర్ అధికారి 5G ప్లాన్ రేట్లు 4G ప్లాన్‌లకు సమానంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, జియో యూజర్లు సాధారణంగా అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేస్తున్నారు. దానికి పర్యవసానంగా, 5G ప్లాన్ ధరలు ఇదే రేంజ్‌లో పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏ కంపెనీ మెరుగైన టారిఫ్ ప్లాన్‌లను అందించగలదో ఇప్పుడు చూడాలి. అయితే దీనిపై ప్రకటన వచ్చేంతవరకు ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సిందే.

Read Also : BMW 2 Series Launch : బీఎండబ్ల్యూ నుంచి సూపర్ సిరీస్ కారు.. సెప్టెంబర్ 7న వచ్చేస్తోంది.. ప్రీ-బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి..!