30 కోట్లకు చేరిన యూజర్లు : ఎయిర్‌టెల్‌ను దాటేసిన జియో!

ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.

  • Published By: sreehari ,Published On : April 25, 2019 / 12:04 PM IST
30 కోట్లకు చేరిన యూజర్లు :  ఎయిర్‌టెల్‌ను దాటేసిన జియో!

ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది.

ప్రముఖ రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీలో సంచలనం. వచ్చిన కొద్దికాలంలోనే ఫ్రీ ఆఫర్లతో ఊరించి.. అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ మొబైల్ యూజర్లను తనవైపుకు తిప్పుకుంది. అప్పటివరకూ టెలికం రంగంలో అగ్రస్థానంలో నిలిచిన ఇతర టెలికం ఆపరేటర్లు జియో దెబ్బకు దిగివచ్చాయి. సీజన్ కు తగినట్టుగా ఎక్కడా కూడా రాజీ పడకుండా తమ యూజర్లకు జియో డేటా ఆఫర్లు అందిస్తూ వస్తోంది. జియో ఫోన్, జియో ఫోన్ 2 మొబైల్ ఫోన్లను చౌకైన ధరకే ఇండియన్ మార్కెట్లలో రిలీజ్ చేసి కోట్లాది మంది యూజర్లను ఆకర్షించింది. ఐపీఎల్ 2019 సీజన్ తమ యూజర్లు ఎప్పటికప్పుడూ ఐపీఎల్ అప్ డేట్స్ తో అలరించేందుకు ఐపీఎల్ 4G క్రికెట్ డేటా ప్లాన్ ను ప్రవేశపెట్టింది. రోజురోజుకీ ఎంతోమంది మొబైల్ యూజర్లు జియో యూజర్లుగా చేరిపోతున్నారు. రిలయన్స్ జియోలో 300 మిలియన్ల ( 30 కోట్లు) మంది యూజర్లు చేరిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. 

టాప్ 3లో ఎయిర్ టెల్.. 28.4 కోట్ల మంది యూజర్లు
రెండున్నర ఏళ్ల కాలంలో జియో తన డేటా సామ్రాజ్యాన్ని విస్తరించి టాప్ 2 ర్యాంకులో నిలిచింది. తద్వారా జియో ఇండియాలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా రికార్డు సృష్టించింది. జియో దెబ్బకు టాప్ ప్లేస్ లో ఉన్న టెలికం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ మూడో ర్యాంకుకు పడిపోయింది. ఇప్పుడు జియోలో కస్టమర్లు మార్చిలోనే ఈ మైలురాయిని చేరినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం జియో 306 మిలియన్ల (30.6 కోట్లు) మంది కస్టమర్లతో టాప్ ర్యాంకులో ఉండగా.. 284 మిలియన్ల ( 28.4 కోట్లు) మంది కస్టమర్లతో ఎయిర్ టెల్ తర్వాతి స్థానంలో నిలిచింది. జియో కంటే ఎయిర్ టెల్ దగ్గరగా 8 శాతం కంటే తక్కువగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎయిర్ టెల్ తన 19ఏళ్ల సర్వీసులో మాత్రమే 300 మిలియన్ల కస్టమర్ల మార్క్ ను చేర కలిగింది. (ఎయిర్ టెల్ క్వార్టర్ ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఓ నివేదిక ప్రకారం.. ప్రస్తుతానికి ఎయిర్ టెల్ యూజర్ల డేటా ఆధారంగా అతిచేరువలో జియో నిలిచింది). 

ట్రాయ్ డేటా రిపోర్ట్ ప్రకారం :
ఇటీవల ట్రాయ్ రిలీజ్ చేసిన టెలికం నెలవారీ సబ్ స్ర్కైబర్ల నివేదిక ప్రకారం.. మార్కెట్ లీడర్ వోడాఫోన్-ఐడియా ఏడాది ఆరంభంలో 5.78 మిలియన్ల మంది మొబైల్ సబ్ స్ర్కైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి ముగిసే నాటికి మొత్తం కస్టమర్ల సంఖ్య 409.3 మిలియన్లకు తగ్గిపోయింది. 2016 సెప్టెంబర్ లో టెలికం రంగంలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో.. టెలికం ఇండస్ట్రీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి వచ్చేలా చేసింది. జియో దెబ్బకు ఇతర  చిన్న టెలికం ఆపరేటర్లు ఎయిర్ సెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షట్ డౌన్ అయ్యాయి. టాటా టెలిసర్వీసెస్, టెలినార్, వోడాఫోన్ ఐడియా సెల్యూలర్ మెర్జ్ కావడంతో 15ఏళ్ల తర్వాత టెలికం సెక్టార్ లో కొత్త మార్కెట్ లీడర్ గా గట్టి పోటీనిచ్చాయి. జియో దూకుడుగా రోజురోజుకీ తక్కువ ధరకే డేటా ఆఫర్లు అందిస్తూ కస్టమర్లను చేర్చుకుంటు పోయింది. జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం.. జియోలో 2019 జనవరి నుంచి మార్చి వరకు కొత్త కస్టమర్లుగా 27 మిలియన్ల మంది చేరగా.. 2018లో కొత్త కస్టమర్ల సంఖ్య 120 మిలియన్ల మందికి చేరింది. 

4G సర్వీసుతోనే జియో రికార్డు : 
జియో ఈ రికార్డును కేవలం 4G సర్వీసు ద్వారనే ఎక్కువగా సాధించింది. 2018-19 మార్చి క్వార్టర్ లో జియో నెట్ ప్రాఫిట్ రూ.840 కోట్లు ఉండగా.. గతవారమే 64.7 శాతానికి ఎగసింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో నాలుగు సార్లు పైకి ఎగసి.. రూ.2,964 నుంచి రూ.723 కోట్లు వరకు నెట్ ప్రాఫిట్ సాధించింది. డిసెంబర్ క్వార్టర్లో ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే AGR అత్యధికంగా సర్వీసు యాక్సస్ జియోనే అందించినట్టు ట్రాయ్ డేటా వెల్లడించింది. జియో ఏజీఆర్ రూ.9వేల 482 కోట్లు ఉండగా.. వోడాఫోన్-ఐడియా రూ.7వేల 224 కోట్లు, ఎయిర్ టెల్ మాత్రం రూ.6వేల 440 కోట్లుగా నివేదిక తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి రిలయన్స్ జియో.. 40 శాతం మార్కెట్ షేర్ సాధించి ఆధిపత్యం ప్రదర్శించనుందని అమెరికా ఆధారిత కంపెనీలు అంచనా వేస్తున్నాయి.