సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ రూ. 305 కోట్లు

  • Published By: madhu ,Published On : October 18, 2019 / 04:40 AM IST
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ రూ. 305 కోట్లు

మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంవత్సర ప్యాకేజీ ఎంతో తెలుసా  ? గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సుమారు రూ. 305 కోట్లకు చేరింది. జూన్ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల జీతాన్ని ఆర్జించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈయన వంతు కేటాయించే షేర్లు కూడా పెరిగాయి.

నాదెళ్ల మూల వేతనం 2.3 మిలియన్ డాలర్లే అయినా..ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్ కింద లభించింది. 2017-18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. 

2014లో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు 84.3 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9 లక్షల షేర్లు ఉన్నాయి. మైక్రో సాఫ్ఠ్ ఉద్యోగులు సగటున లక్షా 72 వేల 512 డాలర్ల శాలరీని అందుకుంటున్నారు. నాదెళ్ల వ్యూహం, నాయకత్వంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోందని, కంపెనీ యొక్క స్థితిగతులే మారిపోయాయని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు అంటున్నారు. కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త కొత్త మార్పులు, కొత్త టెక్నాలజీ, మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయన్నారు. 
Read More : ర్లే-డేవిడ్ సన్ కీలక నిర్ణయం…ఈ బైక్ ల ఉత్పత్తి నిలిపివేత