SBI : జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ రూ. 300 కోట్లు వసూలు

జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ తన కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లను వసూలు చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ పై భారీగా వడ్డింపులు చేస్తోంది.

SBI : జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ రూ. 300 కోట్లు వసూలు

Bsbda

IIT-Bombay Study : జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ తన కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లను వసూలు చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ పై భారీగా వడ్డింపులు చేస్తోంది. ఐఐటీ – బొంబాయి అధ్యయనంలో పలు ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. 2015-20 మధ్య కాలంలో దాదాపు 12 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ల నుంచి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాదారులు నాలుగు లావాదేవీల కంటే ఎక్కువగా చేస్తే ప్రతి లావాదేవీకి రూ. 17.70 వసూలు చేసినట్లు తేలింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.9 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ఖాతాల నుంచి రూ. 9.9 కోట్లు వసూలు చేసింది. ఇష్టారీతిన పలు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2018-19 సంవత్సరానికి రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసూలు చేసినట్లు ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ నివేదిక తెలిపింది. 2013 సెప్టెంబర్ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. BSBDAపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో BSBDAను నిర్వహిస్తోంది. ప్రతి డెబిట్ లావాదేవీపై (డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. బ్యాంకులపై ఆర్బీఐ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. లేనిపక్షంలో బ్యాంకులు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తాయని పలువురు వెల్లడిస్తున్నారు.
Read More : Tiger with Monkey: చెట్టెక్కిన పులికి కోతి ఝలక్.. ‘బలంతో ఆడాలి-బలహీనతలతో కాదు’