నిలిచిపోయిన SBI ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు.. ఓపిక పట్టండి: బ్యాంక్

  • Published By: vamsi ,Published On : October 13, 2020 / 05:18 PM IST
నిలిచిపోయిన SBI ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు.. ఓపిక పట్టండి: బ్యాంక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రభావితం అయినట్లుగా బ్యాంకు వెల్లడించింది. దీనిపై బ్యాంక్ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. కనెక్టివిటీ సమస్య కారణంగా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆలస్యం అవుతోందని SBI తెలిపింది. ATM మరియు POS మినహా అన్నీ ఛానెల్‌లు ప్రభావితం అయ్యాయి. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన SBI వినియోగదారులకు ఓపికగా ఉండమని విజ్ఞప్తి చేసింది. సాధారణ సేవలు త్వరలో తిరిగి ప్రారంభం అవనున్నట్లుగా ప్రకటించింది. అయితే, ఇది ATM, POS యంత్రాలను ప్రభావితం చేయట్లేదు.



ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు మరియు ఉద్యోగుల పరంగా SBI దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. 30 జూన్ 2020 నాటికి బ్యాంకు మొత్తం రూ.34 లక్షల కోట్లు డిపాజిట్‌లు చేసింది. దీని రుణం రూ .24 లక్షల కోట్లకు దగ్గరగా ఉంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బిఐకి దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా శాఖలు ఉన్నాయి. 6.6 కోట్లకు పైగా ఎస్‌బిఐ వినియోగదారులు మొబైల్ బ్యాంకింగ్, ATM సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు.



స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI యోనో యాప్‌లో ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది, తద్వారా వినియోగదారులు యాప్‌లోకి లాగిన్ అవ్వకుండా తమ బ్యాంక్ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. SBI యోనో యాప్ ఇప్పుడు ప్రీ-లాగిన్ ఫీచర్ ద్వారా లాగిన్ అవ్వకుండానే మీ ఖాతా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. లావాదేవీలు చేయవచ్చు.