ఎస్బీఐ గుడ్ న్యూస్ : వడ్డీ రేట్లు తగ్గాయి

భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వినియోగదారులకు రిలీఫ్ ఇచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 02:43 AM IST
ఎస్బీఐ గుడ్ న్యూస్ : వడ్డీ రేట్లు తగ్గాయి

భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వినియోగదారులకు రిలీఫ్ ఇచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.

భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి వినియోగదారులకు రిలీఫ్ ఇచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. పండుగ సీజన్‌ కావడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంసిఎల్‌ఆర్‌ కోత పెట్టడం వరుసగా ఇది మూడవసారి. దీంతో ఒక ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 8.15 శాతం. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 20-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అన్ని బల్క్‌ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటులో 10-20 శాతం కోత పెట్టింది. గృహ, ఆటో రుణాల వాటా వరుసగా 35, 36 శాతంగా ఉందని ఎస్బీఐ తెలిపింది.

ఈ తగ్గింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలపై వడ్డీ 0.40 శాతం తగ్గినట్లైంది. బ్యాంకింగ్‌ రంగంలో ఇప్పుడిదే అతి తక్కువ ప్రామాణిక రుణ రేటు. ఎస్బీఐ ప్రధాన ప్రత్యర్థులైన హెచ్‌డీఎఫ్ సీ ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.30 శాతంగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటు 8.35 శాతంగా ఉంది. ఇప్పటికే ఎస్బీఐ అన్ని రుణ, డిపాజిట్‌ పథకాలను ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానించింది. బ్యాంకు రుణ రేట్లు ముందు ముందు మరింత తగ్గిస్తామని ఎస్బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. అక్టోబర్ లో నిర్వహించనున్న పరపతి సమీక్షలో రెపో రేట్లపై ఆర్బీఐ తీసుకునే నిర్ణయం ఆధారంగా తమ బ్యాంకు చర్యలు చేపట్టనుందన్నారు.