Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్.. జోరుగా ట్రేడింగ్!

కొన్నిరోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్‌లు ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. నిరంతర క్షీణత చూసిన తరువాత, ఈ రోజు స్టాక్ మార్కెట్ వేగంగా ట్రేడ్‌ అవుతోంది.

Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్.. జోరుగా ట్రేడింగ్!

Ukrain Stock

Stock Market: యుక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్‌లు ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. నిరంతర క్షీణత చూసిన తరువాత, ఈ రోజు స్టాక్ మార్కెట్ వేగంగా ట్రేడ్‌ను అవుతోంది. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ వారంవారీ గడువు కూడా ముగుస్తుండడంతో వ్యాపార ధోరణి వృద్ధి గ్రీన్ మార్కులో కనిపిస్తుంది.

BSE సెన్సెక్స్ 452 పాయింట్ల జంప్‌తో 55921 వద్ద ప్రారంభమవగా.. నిఫ్టీ ఈరోజు 117.20 పాయింట్ల పెరుగుదలతో 16వేల 723 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

ప్రీ-ఓపెనింగ్ మార్కెట్‌లో:
ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ ఈరోజు 117.20 పాయింట్ల పెరుగుదలతో 16723 స్థాయి వద్ద ప్రీ-ఓపెన్ ట్రేడ్‌ను చూస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 452 పాయింట్ల జంప్‌తో 55921 వద్ద ట్రేడింగ్ ట్రేడింగ్‌ అవుతోంది.

నిఫ్టీ పరిస్థితి..
50 నిఫ్టీ స్టాక్స్‌లో 44 గ్రీన్ మార్క్‌లో.. 6 స్టాక్స్ రెడ్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాలంటే, 200 పాయింట్ల జంప్ కనిపిస్తుంది. ఇది 35,574 స్థాయిలో ఉండగా.. బ్యాంకింగ్ స్టాక్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ విపరీతమైన జోరు చూపుతోంది.

సెక్టోరల్ ఇండెక్స్‌లో కదలిక:
నేటి సెక్టోరల్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే.. ఐటీ, బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు మంచి ఊపుగా ట్రేడవుతున్నాయి. అదే సమయంలో, ఇంధనం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. నిఫ్టీలోని మొత్తం 19 రంగాల సూచీలు బుల్లిష్‌నెస్‌లో గ్రీన్ మార్క్‌లో కనిపిస్తున్నాయి.

నిన్న మార్కెట్ చూసుకుంటే.. సెన్సెక్స్ 778.38 పాయింట్ల పతనంతో 55,468.90 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ 187.95 పాయింట్లు పడిపోయి 16,605.95 వద్ద ముగిసింది.