Mercedes : ఈ స్మార్ట్ కారును మీ మైండ్‌తో కంట్రోల్ చేయొచ్చు.. మీరేమనుకుంటే అదే చేస్తుంది!

ఇదో బెంజ్ కొత్త స్మార్ట్ కారు.. మైండ్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తుంది. మీరు మనస్సులో ఏది అనుకుంటే అదే చేస్తుంది. కారులో స్టీరింగ్ ఉండదు.. కేవలం మీ ఆలోచనలతోనే డ్రైవింగ్ చేయొచ్చు.

Mercedes : ఈ స్మార్ట్ కారును మీ మైండ్‌తో కంట్రోల్ చేయొచ్చు.. మీరేమనుకుంటే అదే చేస్తుంది!

Mind Controlled Concept Car Lets You Switch Radio Stations Just By Thinking About It

Updated On : September 14, 2021 / 10:39 AM IST

Mercedes Mind Control Car : ఇదో బెంజ్ కొత్త స్మార్ట్ కారు.. మైండ్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తుంది. మీరు మనస్సులో ఏది అనుకుంటే అదే చేస్తుంది. కారులో కూర్చొని స్టీరింగ్ టచ్ చేయాల్సిన పనిలేదు. కేవలం మీ ఆలోచనలతోనే కారును నడపవచ్చు. ఇందులోని మైండ్ కంట్రోల్ ఫీచర్ ద్వారా మీ ఆలోచనలకు ఇంటర్ కనెక్ట్ అవుతుంది. అదే.. మెర్సిడెస్ బెంజ్ కొత్త స్మార్ట్ కారు.. విజన్ అవతార్ కాన్సెప్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ ఈ స్మార్ట్ బెంజ్‌ కారును రూపొందించింది. 2020లో జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన CES IAA మొబిలిటీ 2021 షోలో ఈ మెర్సిడెస్ బెంజ్ విజన్ AVTR కాన్సెప్ట్ కారు నెక్స్ట్ వెర్షన్‌ను మెర్సిడెస్ కంపెనీ మొదటిసారిగా ఆవిష్కరించింది. కంపెనీ ప్రకారం.. ఈ కొత్త కారుకు ఆలోచించగల సామర్థ్యం ఉందట..
China Best Cars : ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లను తయారుచేస్తున్న డ్రాగన్ చైనా!

ఎలా పని చేస్తుందంటే?
ఈ మైండ్ కాన్సెప్ట్ కారు.. డ్రైవింగ్ చేసే వ్యక్తి ఆలోచనల ఆధారంగా డిజిటల్ డాష్‌బోర్డ్‌పై డిస్ ప్లే చేస్తుంది. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI)సాయంతో మీ డైరెక్షన్స్ అర్థం చేసుకుంటుంది. డ్రైవింగ్ చేసే సమయంలో మీరు స్క్రీన్‌ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బటన్లను నొక్కాల్సిన పనిలేదు. కేవలం మీ ఆలోచనలతో కారును కంట్రోల్ చేయొచ్చు. మీరేం అనుకుంటున్నారో కారుకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ కారులో కూర్చొన్న డ్రైవర్ చేయాల్సిందిల్లా కేవలం ఆలోచించడమే. స్మార్ట్ కారు వెంటనే రెస్పాన్స్ అవుతుంది. BCI విజువల్ పర్సెప్షన్ ద్వారా డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోగలదు. బీసీఐ టెక్నాలజీ అంటే.. మీరు రేడియో స్టేషన్ మార్చినట్టుగా ఉంటుంది. ఈ కారులో కూర్చున్న డ్రైవర్ హెల్మట్ మాదిరిగా ఉండే వేరబుల్ ఎలక్ట్రోడ్‌లతో BCI డివైజ్ తల వెనుక భాగంలో ధరించాలి.


డిజిటల్ డాష్‌బోర్డ్ డాట్స్ రూపంలో వరుస లైట్‌లతో కనిపిస్తుంది. మీ మెదడులోని ఆలోచనలను ఈ డివైజ్ అర్థం చేసుకోగలదు. రికార్డ్ చేయగలదు. డాష్‌బోర్డ్‌లో కనిపించే ప్రతి సిగ్నల్ ఒక పనిని సూచిస్తుంది. ఆ నిర్దిష్ట కాంతిపై దృష్టి పెడితే చాలు.. దాని పని అదే చేసుకుపోతుంది అంతే.. ప్రమాదాలను నివారించడానికి ఈ టెక్నాలజీ బాగా పనిచేస్తుందని తయారీదారు కంపెనీ చెబుతోంది. ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగానే, దీనికి స్టీరింగ్ వీల్ లేదు.. సౌకర్యవంతమైన చక్రాలతో నడుస్తుంది.
Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

కార్ లోపలి లైట్స్‌ వేయాలంటే ఎలాంటి బటన్స్‌ను నొక్కాల్సిన అవసరం లేదు. మీ మైండ్‌లో వాటి గురించి ఆలోచిస్తే చాలు.. ఆటోమాటిక్ గా స్విచ్‌ఆన్‌, ఆఫ్‌ అయిపోతాయి. వేరబుల్ ఎలక్ట్రోడ్‌లతో BCI డివైజ్ హెల్మెట్‌ సాయంతో కారును కంట్రోల్ చేయొచ్చు. ఈ కారును డిస్నీ సంస్ధ సహకారంతో మెర్సిడెజ్‌ సంయుక్తంగా డెవలప్ చేసింది. ఈ కారు కాన్సెప్ట్‌ను అవతార్‌ మూవీ ఆధారంగా డెవలప్ చేసింది.