Top 5 Upcoming SUVs in India : కొత్త కారు కొంటున్నారా? భారత్‌లో రాబోయే 5 టాప్ SUV కార్లు ఇవే.. ఏ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

Top 5 upcoming SUVs in India : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రతి ఏడాదిలో SUV సెగ్మెంట్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో 43శాతానికి చేరువలో ఉంది.

Top 5 Upcoming SUVs in India : కొత్త కారు కొంటున్నారా? భారత్‌లో రాబోయే 5 టాప్ SUV కార్లు ఇవే.. ఏ కారు ధర ఎంత ఉండొచ్చుంటే?

Top 5 upcoming SUVs in India _ Maruti Suzuki Fronx, Maruti Suzuki Jimny, Kia Seltos facelift & more

Top 5 upcoming SUVs in India : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి ప్రతి ఏడాదిలో SUV సెగ్మెంట్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో 43శాతానికి చేరువలో ఉంది. దాదాపు 48-49శాతం వద్ద వాహన మార్కెట్ పెరిగి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే కొద్ది నెలల్లో అనేక SUVలు దేశ మార్కెట్లోకి రానున్నాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఫ్రాంక్స్, 5 డోర్ల జిమ్నీని లాంచ్ చేయనుంది. కియా ఇండియా (Kia India) సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్, హోండా కార్స్ ఇండియా (Honda Cars India) సరికొత్త మోడల్, హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) మైక్రో-SUVని తీసుకురావాలని భావిస్తున్నారు. భారత మార్కెట్లో రానున్న టాప్ 5 SUV కార్ల మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం..

మారుతీ సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) :
మారుతీ సుజుకి కంపెనీలో ఏప్రిల్ రెండవ వారంలో భారత మార్కెట్లో Fronx లాంచ్ కానుంది. ఈ కొత్త మోడల్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ప్రధాన పోటీదారుగా నిలువనుంది. ఇందులో మారుతి ఇప్పటికే పాపులర్ బ్రెజ్జాను కలిగి ఉంది. Fronx Balenoతో పాటు కార్‌మేకర్ Nexa ఛానెల్‌కు వాల్యూమ్ డ్రైవర్‌గా ఉంటుందని భావిస్తున్నారు. మారుతి ఇప్పటివరకు Fronx కోసం 15,500 కన్నా ఎక్కువ బుకింగ్‌లను నమోదు చేసింది. సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : Maruti Suzuki SUV Cars : మారుతి సుజుకి నుంచి రెండు కొత్త మోడల్ SUV కార్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Fronx మోడల్ ధర రూ. 6.75 లక్షల నుంచి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నారు. Fronx మోడల్ K12N 1.2-లీటర్ Dual-Jet Dual-VVT పెట్రోల్ ఇంజన్ (90PS/113Nm), K10C 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ (100PS/148Nm) కలిగి ఉంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో K12N ఇంజిన్‌తో 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT, K10C ఇంజిన్‌తో 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఉన్నాయి.

Top 5 upcoming SUVs in India _ Maruti Suzuki Fronx, Maruti Suzuki Jimny, Kia Seltos facelift & more

Top 5 upcoming SUVs in India _ Maruti Suzuki Fronx, Maruti Suzuki Jimny

మారుతీ సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) :
జిమ్నీ Fronx తర్వాత లాంచ్ కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రెండు SUVలు Nexa డీలర్‌షిప్‌ల నుంచి సేల్ అందుబాటులో ఉంటాయి. 23,500 కన్నా ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి. జిమ్నీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్‌లను మాత్రమే ఉన్నాయి. SUV ధర రూ. 9 లక్షల నుంచి రూ. 13 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్). జిమ్నీ 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 103PS గరిష్ట శక్తిని 134Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ఉన్నాయి. SUV సుజుకి ALLGRIP PRO 4WD టెక్నాలజీతో లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్)తో రానుంది.

Top 5 upcoming SUVs in India _ Maruti Suzuki Fronx, Maruti Suzuki Jimny, Kia Seltos facelift & more

Top 5 upcoming SUVs in India _ Maruti Suzuki Fronx, Maruti Suzuki Jimny

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) :
ఆగస్టు 2019లో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కియా సెల్టోస్ SUV కొనుగోలుదారులలో బాగా పాపులర్ అయింది. ఆరంభం నుంచే అధిక వాల్యూమ్‌లచే సపోర్టు అందిస్తోంది. నివేదికల ప్రకారం.. కియా ఇండియా ఏడాది తరువాత సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టనుంది. అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లతో రానుంది. పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అలాగే ఉంటాయని భావిస్తున్నారు. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో రానుంది. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత ధర రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త హోండా SUV (New Honda SUV) :
హోండా కార్స్ ఇండియా సరికొత్త SUVని ఈ ఏడాదిలో పండుగ సీజన్ ప్రారంభానికి ముందే లాంచ్ చేయనుంది. ప్రాథమికంగా గ్లోబల్ SUVగా భారత మార్కెట్లోనే అందుబాటులో ఉంటుంది. హోండా SUV ఇప్పటికే భారీ డిమాండ్ పెరుగుతోంది. హోండా సిటీ (Honda City)తో లభించే 1.5-లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు. హోండా SUV ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ మైక్రో SUV (Hyundai Micro SUV) :
ఈ ఏడాది పండుగ సీజన్‌లో మరో SUVని లాంచ్ చేయనుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి వచ్చిన మైక్రో SUV, కంపెనీ SUV లైనప్‌లో ఉంటుంది. కొత్త హ్యుందాయ్ మైక్రో SUV టాటా పంచ్‌కు పోటీగా రానుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, హ్యుందాయ్ Auraకు సపోర్టు ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. వాటితో పవర్‌ట్రెయిన్‌లను షేర్ చేసే అవకాశం ఉంది. హ్యుందాయ్ మైక్రో SUV ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చనని అంచనా.

Read Also : Huawei Watch Ultimate : అద్భుతమైన ఫీచర్లతో హువావే వాచ్ అల్టిమేట్.. సింగిల్ ఛార్జ్‌తో 14 రోజులు వస్తుంది.. ధర ఎంతో తెలుసా?