Turtle Wax: హైదరాబాద్‌లో మూడు నూతన కార్‌ కేర్‌స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్‌ వ్యాక్స్‌

జెనెక్స్‌ సెంటర్‌, ప్లాట్‌నెంబర్‌ 4, అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ మాదాపూర్ వద్ద ఉండగా, ఎక్స్ప్లోడర్ కేంద్రం కేపీహెచ్‭బీ కాలనీ 5వ ఫేస్, ఇండియన్ డెకార్స్- ఇంటి నెంబర్ 8-2-270, రోడ్ నెంబర్ ౩, బంజారా హిల్స్ వద్ద ఉంది

Turtle Wax: హైదరాబాద్‌లో మూడు నూతన కార్‌ కేర్‌స్టూడియోలు ప్రారంభించిన టర్టెల్‌ వ్యాక్స్‌

Updated On : July 19, 2023 / 9:00 PM IST

Hyderabad: కార్‌ కేర్‌ విభాగంలో సేవలనందిస్తున్న టర్టెల్‌ వ్యాక్స్‌ ఇంక్‌ తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్‌ కార్‌ కేర్‌ స్టూడియోలను హైదరాబాద్‌లో జెనెక్స్‌, ఎక్స్ప్లోడర్, ఇండియన్ డెకార్స్ సహకారంతో ప్రారంభించింది. టర్టెల్‌ వ్యాక్స్‌ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లారీ కింగ్, టర్టెల్‌ వ్యాక్స్‌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సాజన్ మురళీ పురవంగర ఈ స్టూడియోలను అతిధుల సమక్షంలో ప్రారంభించారు.

Google Employees : రాబోయే రోజుల్లో గూగుల్ ఉద్యోగులకు ఇంటర్నెట్ పనిచేయదు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

జెనెక్స్‌ సెంటర్‌, ప్లాట్‌నెంబర్‌ 4, అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ మాదాపూర్ వద్ద ఉండగా, ఎక్స్ప్లోడర్ కేంద్రం కేపీహెచ్‭బీ కాలనీ 5వ ఫేస్, ఇండియన్ డెకార్స్- ఇంటి నెంబర్ 8-2-270, రోడ్ నెంబర్ ౩, బంజారా హిల్స్ వద్ద ఉంది. అల్ట్రా మోడ్రన్‌ టర్టెల్‌ వ్యాక్స్‌ డిటైలింగ్‌ సాంకేతితలతో పాటుగా అత్యున్నత అర్హతలు, సుశిక్షితులైన సేవా సిబ్బందిని కలిగిన ఈ టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ స్టూడియోలు విస్తృత శ్రేణి కార్‌ డిటైలింగ్‌ సేవలు, ఉత్పత్తులను కారు ప్రియుల అభిరుచులకు తగినట్లుగా అందించనున్నాయి.

Asia Cup 2023 Schedule : ఆసియా క‌ప్ 2023 షెడ్యూల్ వ‌చ్చేసింది.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఈసందర్భంగా టర్టెల్‌ వ్యాక్స్‌ కార్‌ కేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజన్‌ మురళి పురావంగర మాట్లాడుతూ… తాము హైదరాబాద్‌లో తమ మొదటి రెండు స్టూడియోలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుంచి కార్ కేర్‌పై పెరుగుతున్న ఆసక్తిని చూశామని అన్నారు. ఇక్కడ తమ ఉనికిని విస్తరించడానికి మరో మూడు కార్ కేర్ స్టూడియోని తెరవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సరికొత్త స్టూడియోతో తాము రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రీమియం నాణ్యత గల కారు డిటైలింగ్ సర్వీస్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.