భారత్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్

  • Published By: vamsi ,Published On : May 26, 2020 / 06:14 AM IST
భారత్‌లో 600 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. మహమ్మారి కారణంగా ఉబెర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా 3,700 పూర్తికాల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగా 450 డ్రైవర్ సేవా కేంద్రాల్లో 40 శాతం మూసివేస్తోంది.

ఈ క్రమంలోనే ఉబెర్ కంపెనీ ఇండియాలో కూడా ఉద్యోగుల కోత విధించింది. భారతదేశంలో 600 మందిని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ స్థాయిలు, టీమ్‌లలో వీరిని తొలగించినట్టు ఉబెర్ ప్రకటించింది. డ్రైవర్ , రైడర్ సపోర్ట్ ఇతర డివిజన్లలో 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ వెల్లడించారు.

కరోనా వైరస్,  లాక్‌డౌన్ కారణంగా యాప్ ఆధారిత రైడింగ్ సేవల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. దీంతో ఉబెర్ ఖర్చులను తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని కంపెనీ చెబుతుంది. ఈ తగ్గింపులు ప్రపంచవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా.. అందులో భాగమే అని కంపెనీ వెల్లడించింది. 

Read : లాక్‌డౌన్ పొడిగించడం వల్ల ప్రయోజనం లేదు: ఆనంద్ మహీంద్రా