చరిత్రలోనే తొలిసారి.. సున్నా కంటే చమురు ధరలు పతనం.. ఇంతకీ వినియోగదారుడికి లాభమేనా?

  • Published By: sreehari ,Published On : April 21, 2020 / 08:32 AM IST
చరిత్రలోనే తొలిసారి.. సున్నా కంటే చమురు ధరలు పతనం.. ఇంతకీ వినియోగదారుడికి లాభమేనా?

కరోనా వైరస్‌, లాక్ డౌన్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సున్నా కంటే దిగువ స్థాయికి పడిపోయాయి. చరిత్రలోనే తొలిసారి మైనస్‌లోకి ముడి చమురు ధరలు పడిపోయాయి. మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WIT) బ్యారల్ క్రూడాయిల్ ఫ్యూజర్ కాంట్రాక్ట్ ధర 244 శాతానికి పైగా క్షీణించి మైనస్ డాలర్లకు పడిపోయాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఏకంగా 244 శాతానికి పైగా పడిపోయింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం అర్థరాత్రి 12.10 గంటల సమయానికి ఒక్కసారిగా ఈ చమురు ధరలు పడిపోయాయి. ఎందుకిలా ఒక్కసారిగా పడిపోయాయంటే దానికి కారణం కరోనా వైరస్ ప్రభావమే అని విశ్లేషకులు అంటున్నారు. 

కరోనా ప్రభావంతో దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఇంధన వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది. కరోనా లాక్ డౌన్ తో వాహనాలు బయటకు వచ్చే పరిస్థితులేవు. కొద్ది మొత్తంలోనే వాహనాలు బయటకు వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలావరకు వాహనాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఇందన అవసరాలు లేకుండా పోయింది. ఫలితంగా ముడి చమురు ధరల వినియోగం కూడా తగ్గిపోతు వచ్చింది. అలాగే మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు కూడా మంగళవారంతో ముగియనుంది. ముడి చమురు మార్కెట్ డిమాండ్ తగ్గిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. చమురు NSEలో -5.52 శాతం డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలింది. 

చమురు మార్కెట్లో సోమవారం ( ఏప్రిల్ 20)న భయాందోళనలు మే ఫ్యూచర్స్ ద్వారా తీవ్రతరం అయ్యాయి. మంగళవారం తరువాత ముగియడంతో చమురు మార్కెట్లో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. వాణిజ్యంలో అమెరికా ముడి చమురు WTI కోసం మే ఫ్యూచర్స్ గడువుకు ముందే బారెల్ స్థాయికి మైనస్ 37.63 డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలోని 90 శాతం మంది లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో ముడి చమురుకు వాస్తవంగా డిమాండ్ లేని సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. WTI ధరల సంపూర్ణ పతనం ప్రధానంగా మే WTI ఒప్పందాల గడువు కారణంగానే ఉంది. అనేక దేశాలలో లాక్‌డౌన్, చమురు మార్కెట్లలో సరఫరా కారణంగా గణనీయమైన డిమాండ్ తగ్గిపోయింది. మరో మాటలో చెప్పాలంటే.. అమ్మకందారులు కొనుగోలుదారులకు చెల్లిస్తున్నారని అని రిలిగరే బ్రోకింగ్, మెటల్స్, ఎనర్జీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ Sugandha Sachdeva చెప్పారు.

యుఎస్ ముడిచమురు ధరలు కుప్పకూలినప్పుడు.. ISE బ్రెంట్ ముడి ఇప్పటికీ బ్యారెల్ స్థాయికి 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. Oklahoma (US) కుషింగ్ వద్ద WTI భౌతికంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. సోమవారం క్రాష్ తరువాత, మే డెలివరీ కోసం యుఎస్ ముడి చమురు మంగళవారం ఉదయం బ్యారెల్‌కు 1.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ చమురు రంగంపై బాగా ప్రభావం చూపుతోంది. చమురు కంపెనీలు ఎప్పుడూ ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. 

జూన్‌ నెల ఫ్యూచర్స్‌కు సంబంధించి బ్రెంట్‌ కూడ్ ఆయిల్ బ్యారల్‌ ధర కూడా 5.7 శాతం తగ్గిపోయి 26.48 డాలర్లకు చేరింది. WTI-బ్రెంట్‌ చమురు రేట్ల మధ్య ఇంత భారీ తేడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఇది గమనించిన పెట్రోలియం ఎగుమతి దేశాలు (OPEC) మే 1 నుంచి రోజు వారీ ఉత్పత్తిని 1.2 కోట్ల బ్యారల్‌కు తగ్గించేందుకు ఒప్పుకున్నాయి. అయినప్పటికీ ధరల పతనం ఆగకపోవడం గమనార్హం. Argus Media, అజ్లిన్ అహ్మద్ చెప్పిన ప్రకారం.. ముడి చమురు ధరలు ప్రస్తుతానికి కనిష్ట స్థాయికి పడిపోయాయని, ఇంకా 20 డాలర్లకు పైనే ట్రేడ్ అవుతున్నాయన్నారు. లాక్ డౌన్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుంది? ఎప్పటివరకూ పొడిగిస్తారు అనేదాని బట్టి ఆయిల్ ధరలు ఉంటాయని అహ్మద్ అభిప్రాయపడ్డారు.