Fianacial Year: ఏప్రిల్ 1నే ఆర్ధిక సంవత్సరం ఎందుకో తెలుసా?

జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సాధారణ క్యాలండర్ తో పాటుగా ఆర్ధిక సంవత్సరాన్ని యధావిధిగా కొనసాగిస్తుంటారు. మరి భారత్ లో మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేక తేడా

Fianacial Year: ఏప్రిల్ 1నే ఆర్ధిక సంవత్సరం ఎందుకో తెలుసా?

Fiscal

Fianacial Year: ఏప్రిల్ 1 నుంచి భారత్ లో కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి 31 వరకు భారత్ లో ఆర్ధిక సంవత్సరంగా పరిగణిస్తారు. కార్పొరేట్ వర్గాలు ఇతర వాణిజ్యవ్యాపారా సంస్థలన్నీ..మార్చి 31నాటికీ పద్దులన్నీ సరిచూసుకుని ఆడిట్ నిర్వహించి లెక్కలను రికార్డుకెక్కిస్తారు. అనంతరం లాభనష్టాలను బేరీజు వేస్తుంటారు. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరాన్ని ప్రారంభించి కొత్త పద్దు పుస్తకాలూ తెరుస్తారు. అయితే కొన్ని ఇతర దేశాల్లో మాత్రం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సాధారణ క్యాలండర్ తో పాటుగా ఆర్ధిక సంవత్సరాన్ని యధావిధిగా కొనసాగిస్తుంటారు. మరి భారత్ లో మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేక తేడా. ఆ వివరాలు పూర్తిగా.

Also read:Birth of Earth : భూమి పుట్టుక గురించి కొత్త ఆధారాలు..అక్కడి నుంచే పుట్టిందంటున్న శాస్త్రవేత్తలు

నిజానికి హిందూ క్యాలండర్/సాంప్రదాయం ప్రకారం భారత్ లో కొత్త ఏడాది వైశాఖ మాసానికి కొన్ని రోజులు ముందుగా ప్రారంభమౌతుంది. ఇది సాధారణ క్యాలండర్(గ్రెగోరియన్)లో మార్చి – ఏప్రిల్ నెల మధ్యలో వస్తుంది. మన కొత్త ఏడాది ప్రారంభానికి సూచికగా తెలుగు వారైతే ఉగాది, మరాఠీయులైతే గుడిపడవాగా జరుపుకుంటారు. గతంలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ లో వ్యవసాయాన్ని రబీ, ఖరీఫ్ అనే రెండు కాలాలుగా విభజించారు. అక్టోబర్‌-మార్చి మధ్య రబీ సీజన్‌గా.. జులై-అక్టోబర్‌ మధ్య ఖరీఫ్‌ సీజన్‌గానూ విభజించి పంటలు పండించేవారు. అయితే రబీ పంటల కోతలు ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రారంభమౌతుంటాయి. ఖరీఫ్ సీజన్‌ అక్టోబరు నవంబర్ లో ముగుస్తుంది. అయితే దేశ వ్యాప్తంగా ఈ రెండు కాలాల్లో వచ్చిన పంట ఉత్పత్తి, లాభనష్టాలు వంటి లెక్కలన్నీ తేల్చడానికి ఒక మాసం సమయం పడుతుంది. అదే సమయంలో మార్చి – మే నెల మధ్య ఎండాకాలం కారణంగా రైతులు పంటలు వేయకుండా ఖాళీగా ఉంటారు కాబట్టి మార్చి నెలలో ఆర్ధిక సంవత్సరం ముగింపునకు సౌలభ్యంగా ఉంటుందని భావించి విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

Also read:Asias Best Restaurants : ఆసియా 50 బెస్ట్ రెస్టారెంట్ల లిస్టు విడుదల..భారత్ నుంచి మూడింటికి చోటు

బ్రిటిష్ వారు తెచ్చిన విధానం:
మన సాంప్రదాయం ఎలా ఉన్నా..200 ఏళ్లు దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళు నేర్పిన సిద్ధాంతాలనే నేటికీ మన వర్తకులు అనుసరిస్తున్నారు. జూలియన్ క్యాలండర్ అనుసరించే బ్రిటిష్ వారు మార్చి 25న కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. 1751 ముందు వరకు వారు ఈ జూలియన్ క్యాలండర్ పద్ధతినే అనుసరించేవారు. కాలానుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలండర్ ప్రచ్చుర్యంలోకి రావడంతో బ్రిటిష్ వారు సైతం గ్రెగోరియన్ కు మారిపోయారు. అయితే ఆర్ధిక సంవత్సరాన్ని మాత్రం మార్చి 25 నుంచే కొనసాగించారు. 1751 నుంచి ఆర్ధిక సంవత్సరాన్ని జనవరి 1కి మార్చాలని నిర్ణయించినా..బ్రిటిష్ అకౌంటంట్లు అంగీకరించలేదు.

Also read:Toll Gate Charges Hiked : వాహనదారులకు మరో షాక్.. టోల్‌గేట్ ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు..

ఎందుకంటే..బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాల్లో ప్రజలు మార్చి నెలలో పన్నులు కట్టేవారు. గ్రెగోరియన్ క్యాలండర్ విధానంలోకి మారితే..మూడు నెలల ముందే.. అంటే జనవరి 31 నాటికీ ప్రజలు పన్ను కట్టాల్సి వస్తుంది. పంట పండకుండానే పన్ను కట్టాలంటే ప్రజలపై తీవ్ర భారం పడుతుందని భావించిన బ్రిటిష్ ఆర్ధిక నిపుణులు..ఆర్ధిక సంవత్సరాన్ని మాత్రం మార్చి 25తోనే ప్రారంభించాలని పాలకులకు సూచించారు. జూలియన్ క్యాలండర్ లో మార్చి 25 అంటే గ్రెగోరియన్ క్యాలండర్ లో ఏప్రిల్ 6 అన్నమాట. దింతో బ్రిటిష్ వారు పాలించిన దాదాపు అన్ని దేశాల్లోనూ కొత్త ఆర్ధిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1నే ప్రారంభిస్తారు.

Also read:Rahul Gandhi: “ప్రధాని మోదీ దిన చర్య ఇదే” అంటూ రాహుల్ ట్వీట్