Teacher Arrested: టీచర్‌తో విద్యార్థి ప్రేమాయణం.. ఆమెకు పెళ్లి కుదరడంతో ఆత్మహత్య.. ఉపాధ్యాయురాలి అరెస్టు

తమిళనాడు పోలీసులు మృతుడి ఫోనులోని డేటాను పరిశీలించారు. షర్మిల అనే టీచర్ కు అతడు ప్రతిరోజు ఫోను చేసేవాడని, ప్రతిరోజు వారిద్దరు చాటింగ్ చేసుకునే వారని గుర్తించారు. అలాగే, టీచర్, ఆ విద్యార్థి సన్నిహితంగా ఫొటోలు దిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి స్నేహితులు, చదువుతున్న స్కూలులో ఈ విషయం గురించి పోలీసులు ఆరా తీశారు. షర్మిల ఇంటి వద్ద ట్యూషన్ చెబుతుండడంతో అక్కడకు ఆ విద్యార్థి రెండేళ్లుగా వెళ్తున్నాడని చెప్పారు. ఆమెకు పెళ్లి కుదరడంతో విద్యార్థితో మాట్లాడడం లేదని పోలీసులు తేల్చారు.

Teacher Arrested: టీచర్‌తో విద్యార్థి ప్రేమాయణం.. ఆమెకు పెళ్లి కుదరడంతో ఆత్మహత్య.. ఉపాధ్యాయురాలి అరెస్టు

Teacher Arrested: ఆమె పదో తరగతికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు. పేరు షర్మిల (23). ఓ విద్యార్థి (17) ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమెను అరెస్టు చేసి, జైలుకు పంపిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి షాకింగ్ నిజాలు చెప్పారు. తమిళనాడులోని అంబత్తూర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి 12వ తరగతి పూర్తి చేసి, ఆర్ట్స్ గ్రూప్ లో చేరాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు గత నెల బయటకు వెళ్లి, ఇంటికి వచ్చి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అతడి కుటుంబ సభ్యులు అంబత్తూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు మృతుడి ఫోనులోని డేటాను పరిశీలించారు. షర్మిల అనే టీచర్ కు అతడు ప్రతిరోజు ఫోను చేసేవాడని, ప్రతిరోజు వారిద్దరు చాటింగ్ చేసుకునే వారని గుర్తించారు. అలాగే, టీచర్, ఆ విద్యార్థి సన్నిహితంగా ఫొటోలు దిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి స్నేహితులు, చదువుతున్న స్కూలులో ఈ విషయం గురించి పోలీసులు ఆరా తీశారు. షర్మిల ఇంటి వద్ద ట్యూషన్ చెబుతుండడంతో అక్కడకు ఆ విద్యార్థి రెండేళ్లుగా వెళ్తున్నాడని చెప్పారు.

అయితే, గత నెల క్రితం షర్మిలకు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలిపారు. దీంతో తన వద్దకు వచ్చే విద్యార్థితో ఆమె మాట్లాడడం లేదని, అతడు ఫోన్లు చేస్తే ఎత్తలేదని పోలీసులు చెప్పారు. తనతో ఉన్న సంబంధాన్ని కొనసాగించాలని ఆ టీచర్ ను బాలుడు అడగగా అందుకు ఆమె నిరాకరించిందని తేల్చారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..