దోషాలు పోగోడతానని వివాహిత మెడలో తాళి కట్టిన ……

10TV Telugu News

Hyderabad Crime News గ్రహాలు ,జాతకాలు, దోషాలు, పూజలు, జపాలు దేవుడ్ని నమ్మే భక్తులందరూ ఇవన్నీ నమ్ముతారు. అలా నమ్మిన మహిళ ఒక జ్యోతిష్యుడి చేతిలో మోస పోయింది. ఆమె జాతంకలో దోషాలు ఉన్నాయని పూజలు చేయకపోతే భర్తకు ప్రాణ గండం ఉందని చెప్పి ఆమె మెడలో తాళి కట్టి మోసం చేశాడు ఓ జ్యోతిష్యుడు.

హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో మాధవ్ అనే వ్యక్తి జ్యోతిష్యుడనని చెప్పి ఒక వివాహిత మహిళకు పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో ఆమె జాతకం చూసి వివాహిత భర్తకు గండం ఉందని, జాతకంలో దోషం వల్ల ఆమెకు పక్షవాతం, భర్తకు ప్రాణాపాయం జరుగుతుందని భయపెట్టాడు.భర్తలేని సమయంలో పూజ చేయాలని చెప్పి బాధితురాలికి మాయమాటలు చెప్పాడు. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో పూజ మొదలెట్టాడు. అందులో భాగంగా ఆమెమెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత ఆమె తన భార్య అంటూ డబ్బు కోసం బెదిరించాడు.

అసభ్యకరమైన ఫోటోలు ఆమె ఫోన్ కు పంపిస్తూ ఆమెను వేధించసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో మాధవ్ ను అతనికి సహకరించిన రాఘవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.