ప్రియుడితో కల్సి భర్తను చంపిన భార్య… రూ.5లక్షల కాంట్రాక్ట్

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 07:42 AM IST
ప్రియుడితో కల్సి భర్తను చంపిన భార్య… రూ.5లక్షల కాంట్రాక్ట్

గుజరాత్ లోని అహ్మాదాబాద్ పోలీసులు ఇటీవల ఒక మహిళను ఆమె ప్రియుడ్ని అరెస్ట్ చేశారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది ఆ మహిళ.

అహమదాబాద్ లోని మనేక్ బాగ్ ప్రాంతంలో నివసించే ప్రమోద్ పటేల్ (43) కింజల్ పటేల్(25) అనే మహిళను వివాహాం చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ప్రమోద్ కు అప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలంకాగా…. కింజల్ ను మూడో వివాహం చేసుకున్నాడు.



కింజల్ వ్యక్తిగత పనులమీద అప్పుడప్పుడు హిమ్మత్ నగర్ జిల్లాలోని దబల్ గ్రామానికి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు అక్కడ అమరత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో అది ప్రేమ గా మారింది. ఒక్కోసారి అమరత్ ను కలవటానికే కింజల్ దబల్ వెళ్లి వస్తూ ఉఁడేది.
https://10tv.in/hyderabad-doctor-rapes-brothers-daughter/
భర్తకు తెలియకుండా ప్రేయసి, ప్రియులిద్దరూ తరచూ కలుసుకుని లైంగికానందం పొందేవారు. ప్రమోద్ పటేల్ తన ఉద్యోగానికి వెళ్లగానే కింజల్ దబల్ వెళ్లి వస్తూ ఉండేది. ఈ విషయాన్ని ప్రమోద్ పట్టించుకోలేదు. రెండున్నరేళ్లుగా కింజాల్, అమరత్ ల అక్రమ సంబంధం యధేఛ్చగా సాగింది. భర్తకు తెలియకుండా ప్రియుడితో కలిసి కింజల్ శృంగారాన్ని ఎంజాయ్ చేసింది. ఎన్నాళ్లిలా దొంగచాటుగా కలుసుకోవటం ఒక్కటిగా…ఒక్కచోటే కలిసుందాం అనుకున్నారు.



ఏం చేయాలా అని ఆలోచించుకున్నారు. 8 నెలల క్రితం ప్లాన్ చేసుకున్నారు. భర్తను చంపేయాలని కింజల్ ఆలోచించింది. ఇదే విషయాన్ని అమరత్ కు చెప్పింది. ఇద్దరూ ఓకే అనుకున్నారు. అమరత్ ఈ విషయాన్ని తన స్నేహితుడు,రాజస్ధాన్ కు చెందిన సురేష్ కు చెప్పాడు. రు.5 లక్షల ఇస్తానని చెప్పాడు. అందుకు సురేష్ ఒప్పుకున్నాడు. అమరత్ ప్రమోద్ పని చేసే నర్సరీని చూపించాడు. సురేష్ మరో ఇద్దరికి ఈ ప్లాన్ చెప్పాడు. వారు కూడా సరే అన్నారు.

ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేందుకు.. సరైన సమయం కోసం వేచి చూశారు. ప్రమోద్ కదలికలను ఎప్పటికప్పుడు కింజల్ అమరత్ కు చెప్తూ వచ్చింది.గత గురువారం సెప్టెంబర్ 3వ తేదీ ఇంటికి ఆలస్యంగా వస్తానని ప్రమోద్ భార్య కింజల్ కు ఫోన్ చేసి చెప్పాడు.



ఇదే విషయాన్ని కింజల్ అమరత్ కు చేరవేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కింజల్ తన ప్లాన్ అమలు చేసింది. అదే రోజు రాత్రి కింజల్ తన భర్త ఇంకా ఇంటికి తిరిగిరాలేదని….మీ వద్దకు ఏమైనా వచ్చాడా అని బంధువులకు పోన్ చేసి అడిగింది. మరోవైపు అమరత్ ప్రమోద్ గురించి అప్ డేట్ సురేష్ కు చేరవేశాడు.

వెంటనే సురేష్ రంగంలోకి దిగాడు. తన ఇద్దరు సహచరులతో కలిసి ప్రమోద్ పని చేసే చోట కాపు కాశాడు. నర్సరీనుంచి బయటకు వచ్చి….ఇంటికి బయలు దేరిన ప్రమోద్ ను మార్గమధ్యంలో మహమ్మదాపూర్ వద్ద దారి కాచి హత్య చేశారు. మరునాడు గుర్తు తెలియని మృతదేహాంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు.



దర్యాప్తులో ప్రమోదు ను గుర్తించి…. అతని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే హత్య చేయించానని ఒప్పుకుంది కింజల్. ఆమె ప్రియుడు అమరత్ ను పోలీసులు అరెస్టు చేసారు. హత్య చేసిన కిరాయి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.