Robbery: అందరి కళ్లముందే రూ.35 లక్షలు అపహరించిన 12 ఏళ్ల బాలుడు

ఇంతలో ఒక బాలుడు బ్యాంకు లోపలికి వచ్చి క్షణాల్లో ఒక నల్లటి బ్యాగుతో బయటికి వెళ్లాడు. బాలుడు సీసీటీవీ కెమెరాల్లో సరిగా కనిపించలేదు కానీ, ఒట్టి చేతులతో వచ్చి బ్యాగుతో బయటికి వెళ్లడం మాత్రం స్పష్టంగా కనిపించింది. బాలుడు బ్యాగుతో వెళ్లడాన్ని కొంత మంది చూసి ఉండవచ్చు కానీ.. డబ్బు సంచితో వెళ్తున్నాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ తంతంగం అంతా కేవలం నిమిషం వ్యవధిలో జరిగిపోయింది.

Robbery: అందరి కళ్లముందే రూ.35 లక్షలు అపహరించిన 12 ఏళ్ల బాలుడు

Punjab: అన్నిసార్లు నేరాలు నేరం జరుగుతున్నప్పుడు తెలియవు. అది జరిగిపోయి దాని ప్రభావం తెలుస్తున్నాకొద్ది అర్థమవుతుంటాయి. అలాగే దొంగతనాలు కూడా అంతే. కళ్ల ముందే జరుగుతుంది. కానీ అలా కనిపించదు. తీరా సొమ్ము కనిపించకపోయేటప్పటికీ లబోదిబో అంటుంటాం. నేరస్తుల శైలి, సందర్భాల్ని బట్టి కూడా ఇలా అనిపిస్తుంటుంది. తాజాగా 12 ఏళ్ల బ్యాంకులోకి వచ్చి 35 లక్షల రూపాయల బ్యాగుతో ఉడాయిస్తున్నా ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఎవరి పనుల్లో వారు హడావిడిగా ఉండడం కాబోలు.. ఆ బాలుడిని అంతగా పట్టించుకోలేదు. తీరా నగదు కనిపించకపోయే సరికి ఆరా తీసీ సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది.

పంజాబ్ రాష్ట్రం పాటియాలలోని షెరన్‭వాలా గేట్‭లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. బ్యాంకులో చాలా మంది ఉన్నారు. బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక బాలుడు బ్యాంకు లోపలికి వచ్చి క్షణాల్లో ఒక నల్లటి బ్యాగుతో బయటికి వెళ్లాడు. బాలుడు సీసీటీవీ కెమెరాల్లో సరిగా కనిపించలేదు కానీ, ఒట్టి చేతులతో వచ్చి బ్యాగుతో బయటికి వెళ్లడం మాత్రం స్పష్టంగా కనిపించింది. బాలుడు బ్యాగుతో వెళ్లడాన్ని కొంత మంది చూసి ఉండవచ్చు కానీ.. డబ్బు సంచితో వెళ్తున్నాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈ తంతంగం అంతా కేవలం నిమిషం వ్యవధిలో జరిగిపోయింది.

Cyber Crimes : దేశంలో మూడేళ్లలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు.. ఎన్నో తెలుసా?

అయితే మరిన్ని సీసీటీవీ పుటేజీలు పరిశీలించగా సిబ్బంది నగదు బ్యాగుతో వచ్చినప్పుడే వారిని ఆ బాలుడు గమనించాడని, చాలా సేపటి నుంచి డబ్బు ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందో చూసుకుని అదను చూసి బ్యాంకు లోపలికి దూరాడని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అయితే ఏ పుటేజీలోనూ ఆ బాలుడు ఎవరో స్పష్టంగా కనిపించలేదట. కాకపోతే అతడికి 12 ఏళ్లు ఉంటాయని మాత్రం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలుడి కోసం గాలిస్తున్నారు.