Punjab : చిన్నారిపై లైంగిక దాడి, హత్యాయత్నం

పంజాబ్ లోని   బర్నాలాలో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ళ వ్యక్తి 8 ఏళ్ళ బాలికపై లైంగిక దాడి చేసి అత్యాచారం చేయబోయాడు. 

Punjab : చిన్నారిపై లైంగిక దాడి, హత్యాయత్నం

New Project (12)

Punjab : పంజాబ్ లోని   బర్నాలాలో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ళ వ్యక్తి 8 ఏళ్ళ బాలికపై లైంగిక దాడి చేసి అత్యాచారం చేయబోయాడు.  ఇంటి సమీపంలోని ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న బాలికను 40 ఏళ్ల వ్యక్తి ఖాళీగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ లైంగికంగా వేధించి, అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాలికను చంపటానికి యత్నించాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారు బాలికను చికిత్స నిమిత్తం ధనౌలా లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read : Yadagirigutta : యాదగిరి గుట్టలో కూలిన పాత భవనం-నలుగురు మృతి
రక్తపు మరకలున్న బాలిక దుస్తులను పోలీసులకు అప్పగించారు.  బాధితురాలి తాత ఇచ్చిన ఫిర్యాదుతో    నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్ననిందితుడి కోసం గాలిస్తున్నారు.