Nandyala : కాపురానికి వెళ్లడం లేదని కూతురును హత్య చేసిన తండ్రి

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Nandyala : కాపురానికి వెళ్లడం లేదని కూతురును హత్య చేసిన తండ్రి

Nandyala

Nandyala : నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. తల, మొండెంను నల్లమల ఫారెస్ట్ బోగధాలో తండ్రి దేవేందర్ రెడ్డి పడేశాడు. వివాహం చేసి ఏడాదిన్నర గడిచినా కూతురు కాపురానికి వెళ్లకపోవడంతో తండ్రి ఈ హత్య చేశాడని తెలుస్తోంది. తన మనవరాలు కనిపించకపోవడంతో తాత శివారెడ్డి ఫిర్యాదుతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

ప్రసన్నను బనగామ మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ప్రసన్న తన భర్తతో కాపురం చేయకుండా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో నివాసముండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. కూతురు ప్రసన్న ఎవరో వ్యక్తిని ప్రేమించినందుకే ఇక్కడ నివాసముంటుందని తెలుసుకున్న తండ్రి దేవేందర్ రెడ్డి తన పరువు పోతుందని కూతురిని హత్య చేసినట్లు తెలుస్తోంది.

Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి

నల్లమల ఫారెస్ట్ బోగధా వద్ద యువతి ప్రసన్న మృతదేహాన్ని పాణ్యం పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం నంద్యాల సర్వజనా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దేవేందర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. దాదాపు వారం క్రితం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.