Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు..కీలక విషయాలు వెల్లడించిన సాదుద్దీన్ మాలిక్

విచారణలో మాలిక్ పలు కీలక అంశాలు వెల్లడించారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార కేసు..కీలక విషయాలు వెల్లడించిన సాదుద్దీన్ మాలిక్

Girl Rape

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచార కేసులో ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ మొదటి రోజు కస్టడీ విచారణ ముగిసింది. సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు 6 గంటలు పాటు విచారణ చేశారు. సాదుద్దీన్ మాలిక్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. విచారణలో మాలిక్ పలు కీలక అంశాలు వెల్లడించారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.

విచారణలో సాదుడిన్ మాలిక్ ఐఓ అధికారికి సంచలన విషయాలు వెల్లడించారు. మైనర్ లతో తనకి రెండు నెలల ఫ్రెండ్ షిప్ ఉంది. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో నేను ఇన్నోవా కారులో పబ్ కి వచ్చాను. మమల్ని జమిల్ అనే ఇన్నోవా డ్రైవర్ పబ్ వద్దకు తీసుకువచ్చాడు. మొదట బాలికను వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు కలిశాడు. ఆ తరవాత నేను అనుసరించాను. బాలిక బయటకు వచ్చిన అనంతరం నాతో పాటు మైనర్లు పరిచయం చేసుకున్నాము. ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని చెప్పడంతో బాలిక మాతో పాటు బెంజ్ కారులో వచ్చింది.

JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. ఆ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ తప్పదా?

ఇన్నోవా కారు పబ్ వద్ద పార్క్ చేసి జమీల్ అనే డ్రైవర్ వెళ్ళి పోయాడు. అనంతరం అమ్మాయితో మైనర్లు బెంజ్ కారులో ఉండగా నేను ఇన్నోవా కారులోనే బెంజ్ కారు వెనుకే అనుసరించాను. సాదూద్దీన్ మాలిక్ ను ఈ నెల 3న రిమాండ్ చేసే సమయంలో చెప్పిన 8 పేజీల స్టేట్ మెంట్ విషయాలను ఇటీవలే బాలిక రెండవ సారి స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ నెల 7న ఇద్దరు మైనర్ లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మాలిక్ ను పోలీసులు పలు కోణాల్లో విచారించారు.

రేపు రెండవ రోజు సాదుద్దీన్ మాలిక్ ను ఐ ఓ బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారణ చేయనున్నారు. మొదటిరోజు విచారణలో సాదుధ్ధూన్ మాలిక్ సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు దాటవేసే సమాధానం చెప్పారు. రేపు రెండవరోజు కస్టడిలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. రేపు ముగ్గురు మైనర్స్ ను విచారించనున్నారు. జువైల్ హోంలోనే కస్టడి విచారణ సాగనుంది. ఐదురోజుల పాటు మైనర్స్ కస్టడి విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.