Hyderabad : టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు ప్లాన్-పోలీసుల అదుపులో నిందితుడు

నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఒక వ్యక్తి ప్లాన్ రూపోందించాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.

Hyderabad : టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు ప్లాన్-పోలీసుల అదుపులో నిందితుడు

Hyderabad : నిజామాబాద్ జిల్లా  ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఒక వ్యక్తి ప్లాన్ రూపోందించాడు. ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. ఆర్మూర్ నియోజక వర్గం పరిధిలో మక్లూర్ మండలం కల్లాడి గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్  జీవన్ రెడ్డిని హత్య చేయటానికి  మారణాయుధాలతో  హైదరాబాద్ వచ్చాడు.

బంజారా హిల్స్, రోడ్ నెంబరు 12 లో జీవన్ రెడ్డి నివసిస్తున్న వేమూరి ఎన్ క్లేవ్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడ సాగాడు. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు జీవన్ రెడ్డి ఇంటివద్దకు వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

తన భార్య పెద్దగాని లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో  ప్రసాద్ గౌడ్   జీవన్ రెడ్డి పై కక్ష పెంచుకున్నట్లు తెలిసింది.  అతని వద్ద నుంచి ఒక కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ పోలీసులు  ప్రసాద్ గౌడ్‌ను విచారిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Also Read : Har Ghar Tiranga: సోష‌ల్ మీడియా డీపీలు మార్చుకున్న మోదీ, కేంద్ర మంత్రులు