Delhi : లైంగిక వేధింపుల కేసులో బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పై కేసు

బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేసే

Delhi : లైంగిక వేధింపుల కేసులో బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పై కేసు

Molestation

Delhi :  బీహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేసే మహిళ తివారీపై ఫిర్యాదు చేసింది.

గతేడాది  ఢిల్లీలో జరిగిన టీ 20 మ్యాచ్ లకు  సంబంధించి ఆ మహిళకు చెందిన కంపెనీ పని చేసింది. దీంతో బీసీఏ ఆ కంపెనీకి నగదు చెల్లించాల్సి ఉంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ తివారీ ఈచెల్లింపులు జరపాల్సిఉంది.

బిల్లుల చెల్లింపు గురించి మాట్లాడేందుకు జులైలో తివారీ ఆ మహిళను ఒక ఫైవ్ స్టార్ హోటల్ కు రమ్మనమని పిలిచాడు. అక్కడ అతను ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు.
Also Read : Massage Parlour : స్పా ముసుగులో వ్యభిచారం… బెంజి కారులో వచ్చి పోలీసులకు దొరికి పోయిన విటుడు
ఆమె అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. దీంతో అతను ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగవని హామీ ఇచ్చాడు.

అయినా మరోసారి బిల్లులు చెల్లించే సమయంలో తివారీ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read : TS Covid Update :తెలంగాణలో ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు