Bijendra Prasad Yadav: బిహార్‭లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల మృతి.. దానిని సమర్ధిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మంత్రి

పూర్నియాలో భారత ప్రభుత్వ గ్రిడ్‌లో కొంత సమస్య ఉందని, దానిని కూడా రెండు రోజుల క్రితం సరిదిద్దామని మంత్రి బిజేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే ఇంతలో కొందరు యువకులు అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టారు.

Bijendra Prasad Yadav: బిహార్‭లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకుల మృతి.. దానిని సమర్ధిస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మంత్రి

Updated On : July 27, 2023 / 4:34 PM IST

Bihar: బీహార్‌లోని కటిహార్‌(katihar)లో విద్యుత్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని నిరసన వ్యక్తం చేసిన వారిపై పోలీసులు కాల్పులు (police firing) జరపడంతో ఇద్దరు యువకులు మరణించిన ఘటనపై ఇంధన శాఖ మంత్రి (energy minister) బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (Bijendra Prasad Yadav) కఠిన ప్రకటన చేశారు. రౌడీయిజం చేసే వారిపై లాఠీలు, తూటాలు నిత్యం ప్రయోగిస్తారంటూ దారుణంగా స్పందించారు. తాజా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ సక్రమంగా అందడం లేదని, వర్షాకాలంలో ట్రిప్పింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయని సరికాదని, ఎక్కడో చెట్టు పడిపోవడం, ఎక్కడో స్తంభం పడిపోవడం జరుగుతాయని, దాన్ని సరిచేయడానికి సమయం పడుతుందని అన్నారు.

Modi vs Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‭కు బిగిస్తున్న ఎర్ర డైరీ ఉచ్చు.. ప్రధాని మోదీ కూడా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు

పూర్నియాలో భారత ప్రభుత్వ గ్రిడ్‌లో కొంత సమస్య ఉందని, దానిని కూడా రెండు రోజుల క్రితం సరిదిద్దామని మంత్రి బిజేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే ఇంతలో కొందరు యువకులు అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఈ గొడవ తర్వాతే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని శాఖ పరిశీలిస్తోందని చెప్పారు. ఈ విషయమై పోలీసు సూపరింటెండెంట్ నుంచి జిల్లా మేజిస్ట్రేట్ నివేదిక కోరింది. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే తప్పు ఎవరిదని తెలుస్తుందని మంత్రి అన్నారు. అలాగే ప్రజలు దురుసుగా ప్రవర్తిస్తే పోలీసులు లాఠీలతో, కాల్పులతో అదుపు చర్యలు చేపడతారని అన్నారు. నష్టపరిహారానికి సంబంధించి పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

Youth Congress Meet: అధికారం కోసం మణిపూర్‭ను తగలబెట్టారట.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ మీద మండిపడ్డ రాహుల్ గాంధీ

అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రకటనపై మంత్రి బదులిచ్చారు. బిహార్‌లో లాఠీలు, కాల్పులు జరిగితే మణిపూర్‌లో ఏమి జరుగుతుందో, కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో ప్రజలు మాట్లాడుతున్నారని అన్నారు. నిరసనకారుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారన్నది బీజేపీకి కనిపించదని మంత్రి జితేంద్ర విమర్శించారు.