Aadhaar Finger Prints : బీ కేర్ ఫుల్.. ఆధార్ ఫింగర్ ప్రింట్స్‌తో ఘరానా మోసం, సైబర్ క్రిమినల్ అరెస్ట్
ఆధార్ వేలి ముద్రలతో కోట్లు కొట్టే్స్తున్న సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు పోలీసులు.

Aadhaar Finger Prints : అంతరాష్ట్ర సైబర్ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. ఆధార్ వేలి ముద్రలతో కోట్లు కొట్టే్స్తున్న సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్ చేసి ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన సైబర్ కేటుగాడు శేషనాథ్ శర్మను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 440 మందిని ఈ ముఠా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి హార్డ్ డిస్క్, స్కానర్, రెండు సెల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైజ్, ఒక మానిటర్ ను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ ముఠా బారిన పడి నగదు పోగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కడప ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఆధార్ కార్డుల సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా బయోమెట్రిక్ లాక్ లేదా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఏ మాత్రం అలర్ట్ గా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటున్నారు పోలీసులు. ఆధార్ ఫింగర్ ప్రింట్స్ ను సైబర్ క్రిమినల్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాటి ద్వారా కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. మనకు విషయం తెలిసేలోపే అనర్థం జరిగిపోతోంది. అందుకే, ఆధార్ ఫింగర్ ప్రింట్స్ విషయంలో అప్రమత్తత, జాగ్రత్త అవసరం అంటున్నారు పోలీసులు. వాటిని ఎవరూ దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.