UIDAI Aadhaar : ఆధార్‌ విషయంలో తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ వెరిఫికేషన్ లేకుండా అసలే వాడొద్దు.. UIDAI హెచ్చరిక..!

UIDAI Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర వ్యక్తిగత కార్యకలాపాలకు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. వ్యాపారపరంగా కూడా KYC కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్‌లను వినియోగిస్తున్నారు.

UIDAI Aadhaar : ఆధార్‌ విషయంలో తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ వెరిఫికేషన్ లేకుండా అసలే వాడొద్దు.. UIDAI హెచ్చరిక..!

UIDAI says Aadhaar should not be used without online verification

UIDAI Aadhaar : ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది నిత్యావసరంగా మారింది. ప్రభుత్వ పథకాల నుంచి ఇతర వ్యక్తిగత కార్యకలాపాలకు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. వ్యాపారపరంగా కూడా KYC కోసం కస్టమర్ల ఆధార్ కార్డ్‌లను వినియోగిస్తున్నారు. అందులోనూ ఉచిత సేవలను పొందేందుకు కూడా ఆధార్ కార్డును వినియోగిస్తున్నారు.

అయితే మీ ఆధార్ కార్డును పోలిన ఫేక్ ఐడీతో దుర్వినియోగం చేసే వీలుంది. ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పుడు ఒక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. వ్యాపారాలు, యూజర్లు కూడా ఆధార్‌ను గుర్తింపుగా తీసుకునే ముందు తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయాల్సందిగా కోరింది.

UIDAI says Aadhaar should not be used without online verification

UIDAI says Aadhaar should not be used without online verification

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ నంబర్ ధృవీకరణ (ఆధార్ హోల్డర్ సమ్మతి) ఈ-ఆధార్, ఆధార్ PVC కార్డ్, m-ఆధార్) గురించి PIBకి సంబంధించిన నోట్‌లో పేర్కొంది. ఆధార్‌లో 12-అంకెల సంఖ్యను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఫేక్ ఆధార్ వినియోగిస్తే అది శిక్షార్హమైన నేరమని గుర్తించాలి.

ఆఫ్‌లైన్ ధృవీకరణ ద్వారా ఆధార్ డాక్యుమెంట్లను తారుమారు చేయడం ద్వారా గుర్తించవచ్చు. ఇది శిక్షార్హమైన నేరం అవుతుంది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం.. జరిమానాలు విధించడం జరుగుతుంది. ఆధార్ ధృవీకరణలో ఏదైనా 12 అంకెల సంఖ్య ఆధార్ కాదని UIDAI పునరుద్ఘాటిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

UIDAI says Aadhaar should not be used without online verification

UIDAI says Aadhaar should not be used without online verification

ఆధార్ కార్డును ఎలా వెరిఫై చేయాలి?
అన్ని రకాల ఆధార్‌లలో (ఆధార్ లెటర్, ఈ-ఆధార్, ఆధార్ PVC కార్డ్, m-ఆధార్) అందుబాటులో ఉన్న QR కోడ్ ద్వారా ఏదైనా ఆధార్ నంబర్‌ని ధృవీకరించవచ్చు. ఆధార్ కార్డుదారులు mAadhaar యాప్ లేదా ఆధార్ QR కోడ్ స్కానర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. QR కోడ్ స్కానర్ Android, iOS ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు, Windows ఆధారిత అప్లికేషన్‌లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

UIDAI కూడా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను UIDAI కోరింది. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేసేటప్పుడు.. బ్యాంక్ సర్వీసులను పొందుతున్నప్పుడు లేదా హోటల్‌లో చెక్ చేస్తున్నప్పుడు కూడా కస్టమర్‌లు తరచుగా ఆధార్‌ని ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆధార్ కార్డు వివరాలను ఆన్ లైన్ వెరిఫికేషన్ లేకుండా వినియోగించరాదని గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు UIDAI సర్క్యులర్‌లను జారీ చేసిందని PIB పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : New Aadhaar Rules : ఆధార్ కొత్త నిబంధనలు.. ఇకపై పదేళ్లకు ఒకసారి మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందే..!