Chittoor : తల్లీబిడ్డల హత్య, బాలికపై అత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా మైనర్ బాలికపై కన్నేసిన అతడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. Chittoor Court

Chittoor : తల్లీబిడ్డల హత్య, బాలికపై అత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

Chittoor Court (Photo : Google)

Chittoor Court : చిత్తూరు జిల్లాలో తల్లీబిడ్డల హత్యను చేసి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో చిత్తూరు ఏడీజే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది. తల్లి సరళమ్మ, కుమార్తె గంగులమ్మ (12) లను కిరాతకంగా హత్య చేశాడు అదే గ్రామానికి చెందిన సయ్యద్ మౌలాలి. తల్లితో వివాహేతర సంబంధం కొనసాగించిన మౌలాలి కుమార్తె గంగులమ్మ పైనా అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటికి తెలియడంతో 2021 జనవరి 1న ఇద్దరినీ హత్య చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు అన్నమయ్య జిల్లా పోలీసులు. కన్విక్షన్ బేస్ పోలీసింగ్ విధానం ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. 20 నెలల్లోనే ఈ కేసులో మిస్టరీని చేధించారు పోలీసులు.

Also Read..Tirupati : తీవ్ర విషాదం.. అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య, పెళ్లి చేసుకుని ఆ తర్వాత

ఈ కేసు వివరాలను రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కన్విక్షన్ బేస్ పోలీసింగ్.. 2022 సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా 122 కేసుల్లో 108 కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన జిల్లా ఎస్పీ, సిబ్బందిని అభినందించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

గతేడాది తంబళ్లపల్లెలో జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇద్దరి చావుకు కారణమైన, మరో బాలిక జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తికి కోర్టు ఉరిశిక్ష విధించింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన తల్లీ బిడ్డలు సరళమ్మ, గంగులమ్మలతో అదే ఊరికి చెందిన సయ్యద్ మౌలాలి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లీ బిడ్డలను దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా మైనర్ బాలికపై కన్నేసిన అతడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో చిత్తూరు ఏడిజెక్టివ్ న్యాయమూర్తి.. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించారు.

Also Read..Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు

జంట హత్యలు, బాలికపై అత్యాచారం చేసిన మౌలాలిపై పోక్సో కేసు పెట్టారు పోలీసులు. ఈ రెండు కేసుల్లో సుదీర్ఘకాలం వాదోపవాదనలు జరిగాయి. బాలికపై అత్యాచారం కేసులో సయ్యద్ కు జీవిత ఖైదు పడింది. రూ.5 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. తాజాగా జంట హత్యల కేసులో ఉరిశిక్షను విధిస్తూ అదనపు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.