Ganja Seized : అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.

Ganja Seized : అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

Ganja Smuggling In Ambulence

Ganja Seized :  ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. రెండు వేర్వేరు ఘటనల్లో శ్రీలంకకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

నాగపట్నం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. వేదారణ్యం సమీపంలోని పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోనిఘా పెట్టారు.

గురువారం సాయంత్రం సముద్ర తీరంలో నాటు పడవలో ముడు బస్తాలను గమనించారు. ఆ నాటు పడవలో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్తాలను పరీక్షించగా వాటిలో 96 కేజీల గంజాయి లభించింది. దానిని శ్రీలంకకు తరిలించే మణికంఠన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Fake Maoists Arrested : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

మరోక ఘటనలో అంబులెన్స్ లో శ్రీలంకకు తరలిస్తున్న గంజాయిని తంజావూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. తంజావూరులో గంజాయి వాడకం బాగా పెరిగిందనే వార్తల నేపధ్యంలో పోలీసులు నాకా బందీ నిర్వహించసాగారు. అందులో భాగంగా పలువాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ఒక అంబులెన్స్ కూతపెట్టుకుంటూ ముందుకు దూసుకుపోసాగింది.

పోలీసులు ఆపాలని చూసినా ఆగకుండా వెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అంబులెన్స్‌ను వెంబడించి అడ్డుకున్నారు. దీంతో బండారం బయటపడింది. అంబులెన్స్‌లోతరలిస్తున్న 200 కిలోలతో కూడిన గంజాయి బస్తాలను పోలీసులు కనుగొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకని ప్రశ్నించగా ఓ ముఠా శ్రీలంకకు గంజాయి తరలిస్తున్నట్లు తెలిపాడు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.