Fake Maoists Arrested : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని  యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Fake Maoists Arrested : మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

Fake Maoists Arrest

Fake Maoists Arrested : రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని  యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  రాచకొండ పోలీసుల స్పెషల్  ఆపరేషన్ లో నలుగురు మాజీ మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిలో పిట్టల శ్రీనివాస్, వీ.నాగమల్లయ్య, వై. శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి లను పోలీసులు వలపన్ని అరెస్ట్ చేసారు.

అరెస్ట్ అయిన నలుగురు గతంలో సీపీఐ జనశక్తి , మావోయిస్టు పార్టీ లో పనిచేశారు. వీరిలో పిట్ల శ్రీనివాస్ సొంతంగా ఆయుధాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈజీమనీ సంపాదించాలనే ఉద్దేశ్యంతో అక్రమ మార్గం ఎంచుకున్నారు. మావోయిస్ట్‌ల  పేరుతో బెదిరింపు లకు పాల్పడుతూ  ఈ గ్యాంగ్ డబ్బులు వసూలు చేస్తోందని పోలీసులు తెలిపారు.
Also Read : Couple Missing : ప్రేమ పెళ్లి -పెద్దల జోక్యం- విడిపోయి మిస్సింగ్
సామాన్యులకు తుపాకులు చూపించి, బెదిరించి ఈ ముఠా వసూళ్లకు పాల్పడుతోందని గుర్తించారు. ఇంకో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. వీరి వద్దనుంచి 1 తపంచా, 1 పిస్టల్,1 రివాల్వర్,గ్యాస్ సిలెండర్స్, పిస్టల్ లైవ్ రౌండ్స్, 6 బుల్లెట్లు, 3 మొబైల్స్,1 డ్రిల్లింగ్ మిషన్ ,బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ తెలంగాణ రాష్టం అనే పేరుతో గ్యాంగ్ గా ఏర్పడి కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురిచేస్తూ  డబ్బులు దోచుకుంటున్నారు. నిందితుల పైన మారణాయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.