Hyd Crime : హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమకు అడ్డుచెప్పిన తండ్రి.. హత్యచేసిన బాలిక

తన ప్రేమకు అడ్డు చెప్పాడని కన్న తండ్రినే కడతేర్చింది కూతురు.. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది

Hyd Crime : హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమకు అడ్డుచెప్పిన తండ్రి.. హత్యచేసిన బాలిక

Hyd Crime

Hyd Crime : ప్రియుడి మోజులోపడి కన్నతండ్రినే హత్యచేసింది బాలిక. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది జులై నెలలో రామకృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులకు విషయం తెలియడంతో ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి.. కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకున్నారు.

చదవండి : Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది

అనంతరం బాడీని పోస్టుమార్టంకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రమాదవశాత్తు జరిగింది కాదని, శరీరంపై గాయాలు ఉన్నాయని.. ఇది హత్యే అని వైద్యులు తేల్చారు. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇదే సమయంలో కూతురిపై అనుమానం రావడంతో ఆమెను ప్రత్యేకంగా విచారించారు. పోలీసుల విచారణలో మైనర్ బాలిక జరిగిన విషయం తెలిపింది.

చదవండి : Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్‌ నేరాలు : బిపిన్ రావత్‌

తన తండ్రికి కోడికూరలో మత్తుమందు కలిపి పెట్టానని.. సృహకోల్పోయిన తర్వాత తన ప్రియుడు.. ముందుగానే కుదుర్చుకున్న సుఫారీగ్యాంగ్‌కి సమాచారం ఇచ్చానని.. తామంతా కలిసి హత్య చేశామని తెలిపింది. తన ప్రేమకు అడ్డు చెప్పడంతోనే తాను ఈ పని చేశానని పోలీసుల విచారణలో వెల్లడించింది. దీంతో మైనర్ బాలికతోపాటు, ఆమె ప్రియుడు భూపాల్, హత్యచేసిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కి తరలించారు.