Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్‌ నేరాలు : బిపిన్ రావత్‌

ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇదే సమయాన్నే సైబర్ నేరగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. అంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరాలు పెరిగిపోయాయి.

Cybercrimes : కరోనా సమయంలోనే 500శాతం పెరిగిన సైబర్‌ నేరాలు : బిపిన్ రావత్‌

Cybercrimes In India During Pandemic Have Gone Up By 500 Per Cent

Cybercrimes in Pandemic : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఇదే సమయాన్నే సైబర్ నేరగాళ్లు బాగా క్యాష్ చేసుకున్నారు. అంతా డిజిటల్ మయం కావడంతో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయారు. డిజిటల్ పేమెంట్లు చేసే యూజర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించి ఉండటంతో ప్రజలంతా బయటకు వచ్చే పరిస్థితి లేక అంతా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయాన్ని  సైబర్ నేరగాళ్లు తమకు నేరాలకు అడ్డగా మార్చుకున్నారు.

కరోనా పరిస్థితుల్లో సైబర్ నేరాల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిందో ఇప్పుడు అదే విషయాన్ని భారత చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్‌ రావత్‌ ప్రస్తావించారు. హ్యాకింగ్‌ అండ్ సైబర్‌ సెక్యూరిటీ బ్రీఫింగ్‌ ‘కకాన్’ (C0c0n) 14వ సమావేశం సందర్భంగా రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా పరిస్థితుల్లో దేశంలో సైబర్‌ నేరాలో భారీగా పెరిగాయని రావత్ అన్నారు. ప్రత్యేకించి కరోనా సమయంలోనే సైబర్ నేరాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించిందని చెప్పారు. కరోనా మహమ్మారి కొనసాగుతున్న పరిస్థితుల్లో సైబర్‌ నేరాలు 500 శాతం మేర పెరిగాయని పేర్కొన్నారు.

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో భవిష్యత్తులో సైబర్ ముప్పు కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం ఉందన్నారు. మనం వినియోగించే  డ్రోన్లు, ర్యాన్సమ్‌వేర్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్ థింగ్స్ డివైజ్‌లు వంటి ప్రమాదాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ డివైజ్ లతో రానున్న రోజుల్లో సైబర్ ముప్పు కూడా లేకపోలేదన్నారు. ఈ విషయంలో దేశం, రాష్ట్రాల పాత్రను కూడా పరిగణించాలి’ రావత్‌ తెలిపారు.
Read Also : Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్