Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది

సికింద్రాబాద్ లో నివాసం ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఫేస్ బుక్ ద్వారా..ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా అని తీరా చూస్తే..అందమైన అమ్మాయి ఫొటో ఉంది.

Cyber Crime : ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది..పెళ్లి చేసుకుంటానంది, రూ. 95 లక్షలు కొట్టేసింది

Fb

Hyderabad Cyber Crime : సోషల్ మీడియాలో అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మవద్దని అటు పోలీసులు ఇటు నిపుణులు హెచ్చరిస్తున్నా..వారి మాటలను పట్టించుకోవడం లేదు. ముందుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి…తాను విదేశాల్లో ఉంటానని, బాగా డబ్బు ఉందని..పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి నిలువునా దోచేస్తున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు. ఇందులో మహిళలు కూడా ఉండడం గమనార్హం. తియ్య తియ్యగా..మత్తు మత్తుగా ఛాట్ చేస్తూ..వారిని మగ్గులోకి దించేస్తున్నారు కొంతమంది కి‘లేడీ’లు. వీరి బారిన పడి..లక్షలు పొగొట్టుకున్న పలువురు బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లకు పరుగెడుతున్నారు. తాజాగా..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని నిండా ముంచింది సైబర్ కిలాడి. ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు కథనం ప్రకారం..

Read More : AP PRC : పీఆర్సీ రిపోర్టు ఇస్తారా ? ఇవ్వరా ? భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం

సికింద్రాబాద్ లో నివాసం ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఫేస్ బుక్ ద్వారా..ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా అని తీరా చూస్తే..అందమైన అమ్మాయి ఫొటో ఉంది. అమ్మాయి కదా..ఒకే చెప్పాడు. ఏపీలోని గుంటూరులో ఉంటానని..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు చెప్పింది. ఇద్దరి మధ్య తరచూ ఛాటింగ్..జరిగింది. ఈ స్నేహం కాస్తా..మనస్సులు కలిసే దాక వెళ్లాయి. అయితే..ఇదంతా..ఫేస్ బుక్ లోనే. ఆ అమ్మాయిని అతను చూడలేదు.

Read More : Tirupati: కోలుకుంటున్న తిరుపతి.. నదుల్లా మారిన వీధులు

తనకు అత్యవసరం వచ్చిందని చెబుతూ..అతని దగ్గరి నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు గుంజడం ప్రారంభించింది. మొదట్లోనే డౌట్ వచ్చి బాగుండేది. చివరకు రూ. 95 లక్షలు వరకు ముట్టచెప్పిన తర్వాత..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అందమైన అమ్మాయి ఫేస్ బుక్ ఖాతా డిలీట్ అయిపోయింది. వామ్మో..నేను మోసపోయానని గ్రహించి…హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.