Tirupati: కోలుకుంటున్న తిరుపతి.. నదుల్లా మారిన వీధులు

రెండు రోజుల పాటు వణుకు పుట్టించిన భారీ వర్షాల నుంచి తిరుపతి కోలుకుంటుంది.

10TV Telugu News

Tirupati: రెండు రోజుల పాటు వణుకు పుట్టించిన భారీ వర్షాల నుంచి తిరుపతి కోలుకుంటుంది. భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోయింది తిరుపతి. నగర వీధులు నదులను తలపించగా.. ఎట్టకేలకు కోలుకుని మామూలు స్థితికి వస్తున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికీ నీళ్లు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. కాలువలు మాత్రం ఇంకా పొంగిపొర్లుతూనే ఉన్నాయి. ఇళ్లలోకి వచ్చిన నీళ్లతో శివారు ప్రాంత వాసుల అవస్థలు పడుతున్నారు.

కపిల తీర్ధం వద్ద వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుండగా.. తిరుమల కొండ మీద నుంచి వచ్చిన నీరే, నగరాన్ని ముంచెత్తిందని భావిస్తున్నారు అధికారులు. తిరుపతి డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీ హోదా దర్శించుకున్నా కూడా అధిగమించలేక మౌలిక లోపాలు మాత్రం నగరంలో వర్షాల కారణంగా కనిపిస్తున్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో.. చాలా చోట్ల బారికేడ్లు పెట్టి ఉన్నారు. నీళ్లు కూడా నిలిచిపోయి కనిపిస్తున్నాయి.

తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు కూడా వర్షం కారణంగా నిలిచిపోగా.. సర్వీసులను తిరిగి పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాసంస్థలు మూసుకోగా.. సోమవారం నుంచి తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి-చెన్నై రైలుమార్గంలో పుత్తూరు మండలం తడుకు సమీపంలో రైల్వేట్రాక్‌ వరదనీటిలో మునిగిపోయింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లను మూసివేశారు. అవి ఈరోజు నుంచి అందుబాటులోకి రావచ్చు.

×