Delhi Police : నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసుల దాడులు

నకిలీ దృవ పత్రాలతో విదేశాలకు విధ్యార్దులను, ఉద్యోగులను తరలిచిన కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్‌తో ఇప్పటికే అమెరికా వెళ్లిన ఒక వ్యక్తి

Delhi Police : నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసుల దాడులు

Dellhi Hyderabad Cops

Updated On : April 11, 2022 / 11:56 AM IST

Delhi Police :  నకిలీ దృవ పత్రాలతో విదేశాలకు విధ్యార్దులను, ఉద్యోగులను తరలిచిన కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్‌తో ఇప్పటికే అమెరికా వెళ్లిన ఒక వ్యక్తి అక్క డ సెటిల్ అయ్యాడు.

అమెరికా అధికారులు, కేంద్ర నిఘా వర్గాలతో కలిసి ఢిల్లీ పోలీసులు, హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిల్లో పలు చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని పలు కన్సల్టెన్సీలలో యూఎస్ ఎంబసీ, ఇమ్మిగ్రేషన్, ఢిల్లీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌‌లోని దిల్‌షుక్ నగర్, అమీర్ పేట, కూకట్ పల్లి, బేగం‌పేట, మలక్‌పేట, సరూర్ నగర్ ప్రాంతాల్లో పలువురు కన్సల్టెన్సీ నిర్వాహకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి స్ధానిక పోలీసుల సహాయం అందించారు. అదుపులోకి తీసుకున్న అనుమానితులను పోలీసులు ఢిల్లీ తరలించారు.

Also Read : Roja : కుప్పంపై ఫోకస్.. కొడాలి నాని బాధ్యతలు రోజా స్వీకరిస్తారా..