Delhi girl Viral video: దొంగ వెన్నులో వణుకుపుట్టించి పారిపోయేలా చేసిన అమ్మాయి.. వీడియో వైరల్

ఓ దొంగతో ఓ అమ్మాయి పోరాడి గెలిచిన తీరు అబ్బురపరుస్తోంది. ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి వద్దకు ఓ స్నాచర్ దూసుకొచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోనును లాగబోయాడు. దీంతో ప్రతిఘటించిన ఆ యువతి అతడిపై తిరగబడింది. అతడి టీ-షర్టను పట్టుకుని ఎంతకీ వదలలేదు. దీంతో ఆ యువతిపై ఆ దొంగ దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ అతడిని ఆ యువతి సమర్థంగా ఎదుర్కొంది.

Delhi girl Viral video: దొంగ వెన్నులో వణుకుపుట్టించి పారిపోయేలా చేసిన అమ్మాయి.. వీడియో వైరల్

Delhi girl Viral video

Delhi girl Viral video: ఓ దొంగతో ఓ అమ్మాయి పోరాడి గెలిచిన తీరు అబ్బురపరుస్తోంది. ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి వద్దకు ఓ స్నాచర్ దూసుకొచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోనును లాగబోయాడు. దీంతో ప్రతిఘటించిన ఆ యువతి అతడిపై తిరగబడింది. అతడి టీ-షర్టను పట్టుకుని ఎంతకీ వదలలేదు. దీంతో ఆ యువతిపై ఆ దొంగ దాడి చేయడానికి ప్రయత్నించాడు.

అయినప్పటికీ అతడిని ఆ యువతి సమర్థంగా ఎదుర్కొంది. ఆ యువతి పోరాడుతున్న తీరుకు ఆ దొంగ వెన్నులో వణుకుపుట్టింది. ఆమె ఎంతకూ అతడిని వదలకపోవడంతో ఇక ఆమెతో పోరాడి లాభం లేదనుకున్నాడు ఆ దుండగుడు. ఇంతలో ఆ మొబైల్ ఫోను కిందపడిపోయింది. దీంతో అక్కడి నుంచి దొంగ పరుగులు తీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్ళింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఆ అమ్మాయి టిక్రీ ప్రాంతానికి చెందిందని, తాజ్‌పూర్ పహారీలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వివరించారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు