Student Suicide: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య: టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్ పై బాధిత కుటుంబం ఆరోపణ

కార్పొరేటర్ సుక్క శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నుంచి తమ కుమారుడికి ప్రాణహాని ఉందంటూ నరసింహాగౌడ్ పహాడ్డిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే మే 27న కార్పొరేటర్ సోదరుడు శ్రీకాంత్..శరత్ వంశీ గౌడ్ పై దాడికి పాల్పడ్డాడు

Student Suicide: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య: టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్ పై బాధిత కుటుంబం ఆరోపణ

Crime

Student Suicide: బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని..మామిడిపల్లిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరంకి శరత్ వంశీ గౌడ్ అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాదిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వంశీ గౌడ్ మృతిపై అతని తండ్రి నరసింహగౌడ్ మాట్లాడుతూ..స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్, అతని సోదరుడు తన కుమారుడిపై దాడి చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మామిడిపల్లిలో వాటర్ ట్యాంకర్ పై నీటి సరఫరా చేస్తున్న నరసింహాగౌడ్..నెల రోజుల క్రితం బోరు వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో..బాగు చేసేందుకు రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళాడు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో మోటార్ వద్ద కరెంటు పని చేస్తున్నాడు నరసింహాగౌడ్.

Other Stories: Suicide : గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూసైడ్‌

అదే సమయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్..అతని సోదరుడు శ్రీకాంత్..పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తున్నారు. అయితే నరసింహాగౌడ్ చేతిలో వెలుగుతున్న సెల్ ఫోన్ లైట్ ను చూసిన కార్పొరేటర్ శివకుమార్..అతని వద్దకు వచ్చి..తమను వీడియో తీస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అలాంటిదేం లేదని చెప్పినా..వినకుండా కార్పొరేటర్ శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ కలిసి నరసింహాగౌడ్ పై దాడికి యత్నించారు. అనంతరం నరసింహాగౌడ్ ఈ విషయాన్నీ తన కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించగా..నరసింహాగౌడ్ కుమారుడు శరత్ వంశీ గౌడ్ వెళ్లి కార్పొరేటర్ సుక్క శివకుమార్ ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Other Stories: Konaseema Internet : మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్.. 91మంది అరెస్ట్

దీంతో కార్పొరేటర్ సుక్క శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నుంచి తమ కుమారుడికి ప్రాణహాని ఉందంటూ నరసింహాగౌడ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే మే 27న కార్పొరేటర్ సోదరుడు శ్రీకాంత్..శరత్ వంశీ గౌడ్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ అవమాన భారం భరించలేకనే.. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని..నరసింహాగౌడ్ వాపోయారు. అయితే దాడి ఘటనలపై తమకు ఎలాంటి ఫిర్యాదులురాలేదని ..పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే..శరత్ వంశీ గౌడ్ ఆత్మహత్యకు, తమకూ ఎలాంటి సంబంధం లేదని..మేము ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని..కార్పొరేటర్ సుక్క శివకుమార్ అన్నారు.