Suicide : గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూసైడ్‌

జమ్ముకశ్మీర్‌కు చెందిన కృతి సంభ్యాల్‌.. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తోంది. మరో ఇద్దరితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. నిన్న ఫ్లాట్‌లో రూమ్‌మేట్స్‌ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Suicide : గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సూసైడ్‌

Suicide

software engineer Suicide : మంచి కంపెనీలో మంచి ఉద్యోగం. అయినవాళ్లను విడిచిపెట్టి.. ఊరు కానీ ఊరులో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏం కష్టం వచ్చిందో ఏమో.. ఉరి వేసుకుని ప్రాణం తీసుకుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కృతి సంభ్యాల్‌ సూసైడ్‌ విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. జమ్ముకశ్మీర్‌కు చెందిన కృతి సంభ్యాల్‌.. గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తోంది.

మరో ఇద్దరితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. నిన్న ఫ్లాట్‌లో రూమ్‌మేట్స్‌ లేని టైం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన స్నేహితుడు సచిన్ కుమార్‌కు.. ‘నాకు బతకాలని లేదు’ అని ఓ మెసేజ్‌ పంపింది. అది చూసి సచిన్‌ అప్రమత్తమయ్యాడు. వెంటనే కృతి ఫ్లాట్‌కు వచ్చాడు.

Bride Suicide : ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి నవ వధువు ఆత్మహత్య

అప్పటికే ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కృతిని ఆస్పత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృతి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కృతి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదని ఆమె రూమ్‌మేట్స్‌ చెప్తున్నారు.