Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఏడుగురి అరెస్ట్

నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఏడుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, చాదర్‌ ఘాట్ పోలీసులు సంయుక్తంగా..

Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఏడుగురి అరెస్ట్

Fake Certificates

Fake Certificates : నకిలీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఏడుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్, చాదర్‌ ఘాట్ పోలీసులు సంయుక్తంగా అంతర్ రాష్ట్ర నకిలీ విద్యా సర్టిఫికెట్లు సరఫరా చేస్తున్న ఏడుగురిని రిమాండ్ కు తరలించారు. ఇందులో ప్రధాన కన్సల్టెన్సీ ఆర్గనైజర్ పొలాసి కొరివి వీరన్న స్వామి (VS గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ యజమాని, చాదర్‌ఘాట్ 1) ఈడా విజయ్ కుమార్ (HOD, EEE) 2) కేతన్ సింగ్, సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, భోపాల్, మధ్యప్రదేశ్ (SRKU) ప్రధాన నిందితులు. ఎటువంటి పరీక్షకు హాజరు కాకుండానే నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను సరఫరా చేసి, ఈ ముఠా సభ్యులు సులభంగా డబ్బు సంపాదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నిందితుల వివరాలు:
1. పొలాసి కొరివి వీరన్న స్వామి
2. కంభపు సాయి గౌతమ్
3. చెంరెడ్డి రితేష్ రెడ్డి
4. బచ్చు వెంకట సాయి సుమ రోహిత్
5. మన్నా విల్ఫ్రెడ్
6. కోసిమెట్టి సూర్య తేజ
7. తుమ్మల సాయి తేజ

Hyderabad : బాలికకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్

స్వాధీనం చేసుకున్న మెటీరియల్, నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు:
(10) విద్యార్థుల బయో డేటా ఫారమ్‌లు
(12) కన్సల్టెన్సీ నుండి SRKU నకిలీ మార్కుల మెమోలు, డిగ్రీ సర్టిఫికెట్లు
(06) విద్యార్థులు SRK విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్ నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు
(04) SRK విశ్వవిద్యాలయం, భోపాల్, మధ్యప్రదేశ్ బ్రోచర్లు
(01) విద్యార్థుల వివరాలు ఫోటోలు, కోర్సు.. సేకరించిన మొత్తం రిజిస్టర్
(06) నిందితుల సెల్ ఫోన్లు

తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు అప్పగించారు.

Woman Raped : పోలీసు ఔట్ పోస్ట్‌లో మహిళపై అత్యాచారం, హత్య

కాలేజీ నుంచి మధ్యలో వెళ్లిపోయిన వారు, ఫెయిల్‌ అయిన వారు, సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్న వారి వివరాలు సేకరించే ఈ ముఠా.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) నుంచి అసలైన సర్టిఫికెట్లు పాత తేదీల్లో ఇప్పిస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటారు. బీటెక్‌, బీఎస్సీ, బీకాం ఇతర డిగ్రీలకు సంబంధించిన సర్టిఫికెట్లకు రూ.3 లక్షల నుంచి ఒక లక్ష వరకు వసూలు చేస్తారు. ఇటీవల 9మంది విద్యార్థులకు సంబంధించిన డేటాను సేకరించి కేతన్‌సింగ్‌కు పంపించారు. అందులో ఐదుగురు విద్యార్థులకు సర్టిఫికెట్లు వర్సిటీ నుంచి అందించారు. మిగతా వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డబ్బు చెల్లించిన వారికి సర్టిఫికెట్లు సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముషీరాబాద్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా ముఠా సభ్యులతో పాటు ముగ్గురు విద్యార్థులను పట్టుకున్నారు.