Woman Gang Raped : హైదరాబాద్‌లో దారుణం.. ఆటో ఎక్కిన మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు కోఠిలో ఆటో ఎక్కారు. అయితే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లకుండా సిటీలో వివిధ మార్గాల్లో తిప్పుతూ గాయత్రినగర్‌కు తీసుకెళ్లాడు.

Woman Gang Raped : హైదరాబాద్‌లో దారుణం.. ఆటో ఎక్కిన మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

Gang Raped

woman gang raped : హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కలకలం సృష్టిస్తోంది. ఆటో ఎక్కిన మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను దింపాల్సిన చోట కాకుండా ఆటో డ్రైవర్ మరో చోటుకు తీసుకెళ్లి.. అక్కడ తన స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు కోఠిలో ఆటో ఎక్కారు. అయితే ఆటోడ్రైవర్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లకుండా సిటీలో వివిధ మార్గాల్లో తిప్పుతూ చివరికి గాయత్రినగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతం చూసి మహిళను బలవంతంగా లాక్కెళ్లి మృగాళ్లు దారుణానికి ఒడిగట్టారు.

Wife Gang Raped : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త

అక్కడి నుంచి పారిపోయిన మహిళ.. మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆటో డ్రైవర్‌ను కర్మన్‌ఘాట్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.